For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గొడవ వల్ల హీరోయిన్ నిద్రమాత్రలు.. ఆ సమయంలో నాగబాబు హెల్ప్ చేశారు: నవదీప్

  |

  మొదట హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో నవదీప్ ఆ తరువాత మెల్లగా సపోర్టింగ్ రోల్స్ చేసే యాక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఒకే
  ఒక్క జీవితంలో హ్యాపీగా బ్రతకాలని అనుకునే వ్యక్తిత్వం ఉన్న హ్యాపీ బాయ్ నవదీప్. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఈ స్మార్ట్ బాయ్ ఇటీవల అలీతో సరదాగా షోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా ఒక హీరోయిన్ తో జరిగిన గోడవ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

  నవదీప్ తో ఆ హీరోయిన్..

  నవదీప్ తో ఆ హీరోయిన్..

  నవదీప్ తో ఒక హీరోయిన్ గొడవ పడినట్లు 2005లో అనేక రకాల వార్తలు వచ్చాయి. నవదీప్ కొన్ని రూమర్స్ గురించి విని షాక్ అయ్యాడు కూడా. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అంకిత. తమిళ్ కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కూడా కొన్ని మంచి సినిమాలు చేసింది. అప్పుడప్పుడు బోల్డ్ పాత్రల్లో కూడా గ్లామర్ గా కనిపించింది. ఇక నవదీప్ తో ఆమె మనసు మాట వినదు అనే సినిమాలో నటించింది.

  షూటింగ్ కి రానని చెప్పేసింది

  షూటింగ్ కి రానని చెప్పేసింది

  ఆమెతో జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ.. అప్పటికే అంకిత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. చాలా బిజీగా ఉంది. కానీ నేను ఫెయిల్యూర్స్ లో ఉన్నాను. అయితే తను ఎదో డేట్స్ అటు ఇటు మార్చి ఇచ్చేసినట్లు తెలిసింది. వీళ్ళ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి వస్తోంది అనేలా ప్రవర్తించింది. ఇక సినిమాలో రెండు సాంగ్స్ కోసం రావాలని ఆఖరిసారి అడిగినప్పుడు రానని చెప్పేసింది.

  ఆమె అసలు ఆలోచన ఏమిటంటే

  ఆమె అసలు ఆలోచన ఏమిటంటే

  కానీ ఆ తరువాత దర్శకనిర్మాతలు ఆమెను అగ్రిమెంట్స్ చూపించి న్యాయంగానే రప్పించారు. అనంతరం నిర్మాతతో కాస్త గోడవయ్యింది. ఆమె ఆ కోపాన్ని నాపై చూపించింది. కావాలని జోకులు వేస్తున్నాను అని నాపై నిర్మాతకు కూడా పిర్యాదు చేసింది. ఆమె అసలు ఆలోచన ఏమిటంటే ఎలాగైనా షూటింగ్ ఆపేయ్యలని అనుకుంది.

  నిద్రమాత్రలు తీసుకుందని అనగానే..

  నిద్రమాత్రలు తీసుకుందని అనగానే..

  ఆ తరువాత ఆ గొడవ విషయంలో ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడే అది సెటిల్ అయ్యింది. అంతా హ్యాపీగా ఎండ్ అయ్యింది. ఆ తరువాత ఒక రిపోర్టర్ నాకు ఫోన్ చేసి ఒక షాకింగ్ విషయాన్ని అడిగాడు. మీతో గోడవపడిన తరువాత హీరోయిన్ అంకిత నిద్రమాత్రలు తీసుకుందట. నిజమేనా అని అడగ్గానే అందరం ఆశ్చర్య పోయాము.

  నాగబాబు సహాయం చేశారు

  నాగబాబు సహాయం చేశారు

  ఆ వార్తలు ఎక్కువవ్వకముందే వెంటనే విలేకరులతో సమావేశం నిర్వహించి వారి ముందే వాస్తవాలను బయటపెట్టాను. అలాంటి వార్తలు వినగనే నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు. ఆ విషయంలో నాకు నాగబాబు గారు కూడా సహాయం చేశారు... అని నవదీప్ అంకిత వలన జరిగిన స్టోరీ గురించి చాల క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు. నాగబాబుతో నవదీప్ చందమామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

  English summary
  Needless to say, Navdeep enjoys his bachelor life very happily. He also occasionally takes special trips with friends. Especially going to places like the Himalayas is refreshing. The same thing was recently said to Anasuya on Instagram Live
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X