ఎన్నికల్లో పోటీ: హీరోయిన్‌కు న్యూడ్ ఫోటోల తలనొప్పి!
హైదరాబాద్: గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నవనీత్ కౌర్ మీకు గుర్తుండే ఉంటుంది. త్వరలో అమ్మడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరుపున రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసేందుకు సన్నద్దం అవుతోంది.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేళ ఆమె రెండు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎవరో కొందరు ఆమె ముఖంతో కూడిన న్యూడ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఎదుర్కొంటున్న మరో సమస్య ఏమిటంటే....కులధృవీకరణ పత్రానికి సంబంధించి తప్పుడు డాకుమెంట్లు సమర్పించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు అపఖ్యాతి తెచ్చేందుకు కొందరు తన ఫోటోలను దుర్వినియోగం చేసి ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగు సైట్లలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని వెంటనే అడ్డుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా...కుల ధృవీకరణ పత్రం పొందే క్రమంలో తప్పుడు పత్రాలు సమర్పించిన నవనీత్ కౌర్‌ఫై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముంబై పోలీసులను ఆదేశించారు. జయంత్ వంజరి అనే సోషల్ యాక్టివిస్ట్ ఆమె తప్పుడు పత్రాలు సమర్పించిందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











