»   » కేసీఆర్ బయోపిక్ లో ఊహించని మలుపు: కేసీఆర్ పాత్రలో "నవాజుద్దీన్ సిద్దిఖీ"??

కేసీఆర్ బయోపిక్ లో ఊహించని మలుపు: కేసీఆర్ పాత్రలో "నవాజుద్దీన్ సిద్దిఖీ"??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ సిఎం చంద్రశేఖరరావు పై బయోపిక్ తీయడమనే వార్త ఆ మ‌ధ్య‌ అటు రాజకీయరంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ ఆసక్తిని రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే.. ఒక ఉద్యమాన్ని నిర్వహించి, పోరాడి, చివరకు విజయం సాధించిన వ్యక్తిపై సినిమా తీయడం ఒక సాహసం మాత్రమే కాదు, అందుకు ఓ ప్రత్యేకత కూడా ఉందని చెప్పాలి.

కేసీఆర్ బ‌యోపిక్

కేసీఆర్ బ‌యోపిక్

అయితే ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ తీయాలనే సాహ‌సాన్ని మ‌ధుర శ్రీధర్ చేయ‌డం విశేషం.చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కావటంతో ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టారు చిత్రయూనిట్.

రాజ్‌కుమార్ రావు

రాజ్‌కుమార్ రావు

ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో కేసీఆర్‌గా బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా నవాజుద్ధీన్ సిద్ధీఖీ పేరు తెరమీదకు వచ్చింది.

సర్ఫరోష్‌

సర్ఫరోష్‌

బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్ధీన్ పాత్రల ఎంపికలోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయే నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘సర్ఫరోష్‌'లోని చిన్న పాత్రతో సినీ కెరీర్‌ను ప్రారంభించాడు.

పూర్తి న్యాయం చేయగలడని

పూర్తి న్యాయం చేయగలడని

అనేక కష్టాలకు ఓర్చి.. కృషి, పట్టుదలతో ఇప్పుడు ప్రముఖ నటుడిగా ఎదిగాడు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు తన జేబులో ఒక్క రూపాయి లేని రోజులు కూడా ఉన్నాయని క్యారెక్టర్ కోసం ఫిజికల్ కూడా ఎలాంటి మార్చులు చేసేందుకైన సిద్ధపడే నవాజ్ అయితే కేసీఆర్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు.

English summary
Bollywood actor Nawazuddin Siddiqui to play Telangana CM KCR in his biopic
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu