»   » నటితో సెక్స్ సీన్: ప్రముఖ నటుడి భార్య ఏం చేసిందో తెలుసా?

నటితో సెక్స్ సీన్: ప్రముఖ నటుడి భార్య ఏం చేసిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బాబూమోషాయ్ బందూక్‌బాజ్'. ఈ సినిమాలో నవాజుద్దీన్, నటి బిదితా బాగ్ మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలున్నాయి. ముద్దు సీన్లతో పాటు కాస్త అభ్యంతరంగా ఉండే శృంగార సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ సీన్ల కారణంగానే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 48 కట్స్ సూచించింది అంటే...ఆ సీన్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీన్ల కారణంగా నవాజుద్దీన్ పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చిందట.

భార్య అప్‌సెట్

భార్య అప్‌సెట్

కొన్ని శృంగార సీన్లలో చాలా ఓవర్ గా నటించారు.... అలాంటి సీన్లు చేయడం వల్ల మీ పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదా? అనే ప్రశ్నకు నవాజుద్దీన్ స్పందిస్తూ..... ఇలాంటి సీన్లు చూసినపుడు ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారు. నేను చేసిన సీన్లు చూసి నా భార్య బాగా అప్ సెట్ అయింది. రెండు రోజులు నాతో మాట్లాడలేదు అని నవాజుద్దీన్ తెలిపారు.

సెన్సార్ బోర్డ్ కొత్త చీఫ్

సెన్సార్ బోర్డ్ కొత్త చీఫ్

సెన్సార్ బోర్డ్ కొత్త చీఫ్‌గా ప్రసూన్ జోషి ఎన్నికయ్యారు. వారం క్రితం నిహ్లాని సెన్సార్ బోర్డు చీఫ్ గా ఉన్న సయమంలో ‘బాబుమోషాయ్ బందూక్ బాజ్' చిత్ర సెన్సార్ కు వెళ్లగా 48 కట్స్ సూచించారు. అయితే కొత్తగా ప్రసూన్ జోసి బోర్డు బాధ్యతలు చేపట్టడంతో తమ సినిమాకు న్యాయం జరుగుతుందని, కట్స్ సంఖ్య తగ్గిస్తారని నవాజుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బాబు మోషాయ్

బాబు మోషాయ్

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్' మూవీకి కుషన్ నందీ దర్శకత్వం వహిస్తున్నారు. కుషన్ నంది, కిరణ్ శ్యామ్ ష్రాఫ్, అష్మిత్ కుందర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆగస్టు 25 రిలీజ్

ఆగస్టు 25 రిలీజ్

ఆగస్టు 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివాదాలతో ఈ సినిమాకు హైప్ బాగా వచ్చింది. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.

English summary
You must have seen in the trailer that the next film of Nawazuddin Siddqui, Babumoshai Bandookbaaz, is packed with some raunchy scenes of the actor. Recently, while promoting his film, Nawazuddin revealed to Deccan Chronicle how his sex scene in the film has affected his relation with his wife.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu