For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్స్ సంబంధాల్లో అబద్దాలు, పచ్చిగా రాసాడంటూ విమర్శలు: ఆ నటుడు ఆత్మకథను వెనక్కి తీసుకున్నాడు

  |

  బాలీవుడ్ లో నటుడిగా ఒక ప్రతేక స్థానం ఉన్న నవాజుద్దీన్ సిద్దిఖీ ఇప్పుడు తన సొంత ఆత్మకథ రాసి ఓ వివాదం లో ఇరుక్కున్నాడు. అంతే కాదు తనమీద వచ్చిన ఆరోపణలకి క్షమాపణ చెప్పిమరీ తన ఆత్మకథ 'యన్ ఆర్డినరీ లైఫ్: ఎ మెమయిర్ 'ను వెనక్కి తీసుకున్నాడు. కొన్ని రోజుల కిందటే ఆన్ లైన్లోకి వచ్చింది. ఐతే విడుదలైన కొన్ని రోజులకే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ. తొలి సినిమా మిస్‌ లవ్లీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దిఖీ...పలువురు అగ్రహీరోలతో కలిసి నటించాడు. ది లంచ్ బాక్స్, కిక్, బద్‌లాపూర్,బజరంగీ భాయిజాన్, షారూఖ్ తో రయీస్ సినిమాల్లో తననటనతో మెప్పించాడు. అంతేగాదు తొలిసినిమా మిస్ లవ్లీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సైతం ఎంపికైంది.

  యన్ ఆర్డినరీ లైఫ్

  యన్ ఆర్డినరీ లైఫ్

  ఆ నేపథ్యం లోనే తన ఆత్మకథ అంటూ ‘ది ఆర్డినరీ లైఫ్' అనే పుస్తకాన్ని తెచ్చాడు అయితే నటుడిగా మారాక తాను నడిపిన ఎఫైర్ల గురించి ఇందులో కూలంకషంగా వివరించాడు నవాజ్. ముఖ్యంగా ‘మిస్ లవ్లీ' సినిమాలో తనకు జోడీగా నటించిన నిహారికా సింగ్ తో ఎఫైర్ గురించి మరీ డీప్ గా రాశాడు.

  శృంగారం జరిపిన అనుభవం గురించి

  శృంగారం జరిపిన అనుభవం గురించి

  ఆమెతో శృంగారం జరిపిన అనుభవం గురించి వివరించడానికి ఒక స్పెషల్ ఎపిసోడే కేటాయించాడు. అతను రాసిన పుస్తకం లో నిహారికా ఏపిసోడ్ లో ఇలా వర్ణించాడు. `త‌న‌ను ఒక‌సారి మా ఇంటికి భోజ‌నానికి ఆహ్వానించాను. త‌ర్వాత ఆమె న‌న్ను వాళ్లింటికి ఆహ్వానించింది. కొంచెం సంకోచంగానే ఆమె ఇంటికి బ‌యల్దేరాను.

   గాఢ‌మైన ప్రేమ‌ను పంచుకున్నాం

  గాఢ‌మైన ప్రేమ‌ను పంచుకున్నాం

  వెళ్లి త‌లుపు కొట్టాను. ఆమె త‌లుపు తీయ‌గానే ఇల్లంతా వెలుగుతున్న కొవ్వొత్తులు క‌నిపించాయి. ఆ కొవ్వొత్తుల వెలుగులో ఆమె చాలా అందంగా క‌నిపించ‌డంతో నా ప‌ల్లెటూరి మ‌న‌సు ఆగ‌లేదు. వెంట‌నే ఇద్ద‌రం బెడ్రూంలోకి వెళ్లి, గాఢ‌మైన ప్రేమ‌ను పంచుకున్నాం. త‌ర్వాత ఆ ప్రేమ ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలు కొన‌సాగింది` అని బ‌యోగ్ర‌ఫీలో ఉంది.

   ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయాన్ని కూడా

  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయాన్ని కూడా

  అంతకుముందు ఓ మహిళతో బ్రేకప్ తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయాన్ని కూడా వెల్లడించాడు. అయితే పుస్త‌కంలోని ఈ వ్యాఖ్య‌లను నిహారిక ఖండించింది. పుస్త‌కం అమ్మ‌కాల కోసమే న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇలా త‌ప్పుగా మాట్లాడుతున్నాడ‌ని ఆరోపించింది.

  కొన్ని నెల‌లే క‌లిసున్నాం

  కొన్ని నెల‌లే క‌లిసున్నాం

  "`మిస్ ల‌వ్లీ" చిత్రం త‌ర్వాత మేం కొన్ని నెల‌లే క‌లిసున్నాం. పుస్త‌కంలో ఆయ‌న చెప్పిన విధానం చూస్తే చాలా న‌వ్వొస్తోంది. పుస్త‌కం అమ్మ‌కాల కోసం మ‌హిళను అగౌర‌వ ప‌ర‌చాల‌నుకోవ‌డం స‌బ‌బు కాదు. ఆయ‌న చాలా గొప్ప న‌టుడు. ఆ న‌ట‌న‌ను తెర మీద‌కే ప‌రిమితం చేస్తే బాగుంటుంది` అని నిహారిక అంది.

   ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి

  ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి

  దీంతో ట్విట్టర్‌లో సిద్ధిఖీ స్పందించాడు. క్షమాపణలు తెలియజేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. ‘‘నా జ్ఞాపకాలు(పుస్తకం) ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి. నా పుస్తకాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నా'' అని ప్రకటించాడు. ఆన్‌ ఆర్డినరీ లైఫ్‌​ పేరిట సిద్ధిఖీ రాసిన పుస్తకంపై ఆయన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్‌, సునీత రాజ్‌వర్‌లు మండిపడ్డారు.

   సిగ్గు లేకుండా

  సిగ్గు లేకుండా

  పుస్తకం అమ్ముడు పోయేందుకు సిగ్గు లేకుండా కల్పితాలతో అబద్ధపు కథనాలు రాశాడంటూ తీవ్రంగా విమర్శించారు. ఐతే నిహారికతో పాటు వేరే మహిళ కూడా నవాజుద్దీన్ ఆటో బయోగ్రఫీ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి నవాజ్ లేని పోని విషయాలు కల్పించి అబద్ధాలు రాశాడని ఆరోపించారు.

  జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

  జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

  అతడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. మరోవైపు మహిళల్ని కించపరిచేలా ఈ పుస్తకం ఉందంటూ ఓ లాయర్ నవాజ్ మీద కేసు పెట్టాడు. దీంతో నవాజ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.నిహారిక అయితే ఓ అడుగు ముందుకేసి నటుడిపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.

  ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ అయిపోయి

  ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ అయిపోయి

  ఈ నేపథ్యంలో నవాజుద్దీన్‌ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సిద్ధిఖీ పిచ్చి ఆలోచనలను భరించలేకే అతనికి దూరమైనట్లు మొదటి ప్రేయసి సునీత చెప్పటం విశేషం. . ఐతే ఆల్రెడీ ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ అయిపోయిన ఈ పుస్తకం జనాల్లోకి బాగానే వెళ్లిపోయింది.

  English summary
  Nawazuddin Siddiqui has apologised and withdrawn his autobiography, An Ordinary Life: A Memoir. 'I m apologising 2 every1 who's sentiments r hurt bcz of d chaos around my memoir AnOrdinaryLife. I hereby regret & decide 2 withdraw my book,' the actor tweeted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X