»   » త్రిష అంత చేసినా బాలయ్య మంచి తనంతో వచ్చారు (ఫోటోస్)

త్రిష అంత చేసినా బాలయ్య మంచి తనంతో వచ్చారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రిష ప్రధాన పాత్రలో గోవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నాయకి'. గిరిధర్ ప్రొడక్షన్స్ బేనర్లో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ఈచిత్రం రాజ్ కందుకూరి స‌మ‌ర్పణలో విడుదలవ్వబోతోంది. రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ ఆడియో వేడుకకు బాలయ్య హాజరు కావడం చర్చనీయాంశం అయింది. గతంలో త్రిష బాలయ్య తో 'లయన్' చిత్రంలో నటించింది. ఆ సమయంలో త్రిషపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో త్రిషకు అసలు అవకాశాలు లేక పోయినా....బాలయ్య పిలిచి మరీ అవకాశం ఇచ్చారనే ప్రచారం జరిగింది. కానీ త్రిష మాత్రం ఈ సినిమా పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ బాలయ్యకు తెలిసినా అవేమీ మనసులో పెట్టుకోకుండా ఈ ఆడియో వేడుకకు హాజరయ్యారు. అందుకే కాబోలు త్రిష బాలయ్య పక్కన చాలా వినయంగా, చేతులు కట్టుకుని మరీ కూర్చుంది.

ఆ గొడవ సంగతి పక్కన పెడితే బాలయ్య రాకతో ఆడియో వేడుక గ్రాండ్ గా జరిగింది. త్రిష, గణేష్ వెంకట్రామన్, గోవర్ధన్ రెడ్డి(గోవి), గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, శైలేంద్ర ప్రొడక్షన్స్ శైలేంద్ర బాబు, బసవరాజు, హరీష్, శ్రీధర్ రెడ్డి, మల్కాపురం శివకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, విజయ్ కుమార్ కొండా, దశరథ్, శంకర్, కూచిపూడి వెంకట్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనిల్ రావిపూడి, సురేష్ కొండేటి, నారాయణ గౌడ్, ఠూగూర్, రఘుకుంచె, గౌతంరాజు, రాజ్ కందుకూరి, భాస్కరభట్ట, భీమనేని శ్రీనివాస్ రావు, అంబికా కృష్ణ, సత్యం రాజేష్, సుష్మారాజ్ తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ భీమనేని శ్రీనివాస్ రావు, అంబికా కృష్ణ, ఎన్.శంకర్ విడుదల చేశారు. బిగ్ సీడీని నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆడియో సీడీలను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి తొలి సీడీని త్రిషకు అందించారు.

స్లైడ్ షోలో ఫోటోస్

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ...

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ...

ఒక చేతిలో పువ్వులు, మరో చేతిలో కత్తి పట్టుకుని ఉన్న త్రిష లుక్ బావుంది. వైవిధ్యమైన పాత్ర చేయడమే కాకుండా పాట కూడా చక్కగా పాడింది అంటూ బాలయ్య ప్రశంసించారు.

త్రిష ఆ సినిమాను క్రాస్ చేయాలి

త్రిష ఆ సినిమాను క్రాస్ చేయాలి

నాయకుడు అనే కమల్ సినిమా వచ్చింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ టైటిల్ తో నాయకి అనే సినిమా వస్తుంది. ఆ సినిమాను ఈ సినిమా క్రాస్ చేయాలి అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.

త్రిష మాట్లాడుతూ...

త్రిష మాట్లాడుతూ...

నందమూరి బాలకృష్ణగారికి ప్రత్యేకమైన దన్యవాదాలు. రఘుకుంచె మంచి సంగీతం అందించారు. అంతే కాకుండా నాతో పాట పాడించారు. గోవిగారికి, గిరిధర్ గారికి, రాజ్ కందుకూరి, రాంబాబు సహా అందరికీ థాంక్స్'' అన్నారు.

మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ...

మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ...

త్రిషగారితో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయాలని, అందులో ముఖ్యంగా థ్రిల్లర్ చేయాలనుకున్నాం కానీ చివరకు హర్రర్ కామెడి చేయాలనుకుని చాలా కథలు విన్నాం. అప్పుడు గోవర్ధన్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా స్టార్టయ్యింది. హర్రర్ జోనర్ లో కొత్త సినిమా అన్నారు.

అవార్డు ఖాయం

అవార్డు ఖాయం

త్రిష గారి కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అవుతుంది అన్నారు. తనకు ఆడియెన్స్ రివార్డ్స్ తో పాటు, అవార్డ్స్ కూడా వస్తాయి. త్రి డైమెన్షన్ లో ఆమె నటన అద్భుతం అన్నారు నిర్మాత.

సంగీతం సూపర్

సంగీతం సూపర్

రఘుకుంచె అద్భుతమైన సంగీతం అందించారు. రాజ్ కందుకూరి, రాంబాబు కుంపట్ల సపోర్ట్ మరచిపోలేను...మాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అని నిర్మాత అన్నారు.

దర్శకుడు గోవర్ధన్ మాట్లాడుతూ...

దర్శకుడు గోవర్ధన్ మాట్లాడుతూ...

ముందుగా గిరిధర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్లాప్ మూవీ చేసిన తర్వాత కూడా నా కథను, నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. సత్యంరాజేష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తనలోని మరో లెవల్ ఆర్టిస్ట్ ను చూస్తారు. అలాగే నారారోహిత్ గారు నాకు మంచి మిత్రుడు. అడగ్గానే నాకోసం చిన్న గెస్ట్ రోల్ చేశారు. రెట్రో హర్రర్ కామెడి గతం, భవిష్యత్ కాంబినేషన్ లో కథ రన్ అవుతుంది. అందుకు తగిన విధంగా రఘుకుంచె అద్భుతమైన సంగీతం అందించారు అన్నారు.

నటీనటులు

నటీనటులు

త్రిష‌, బ్ర‌హ్మానందం, స‌త్యం రాజేష్‌, గ‌ణేష్ వెంక‌ట్ రామ‌న్‌, సుష్మ‌రాజ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, మ‌నోబాల‌, కోవై స‌ర‌ళ‌, పూన‌మ్ కౌర్‌, మాధ‌వీల‌త‌, సెంట్రియాన్‌,జీవీ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు.

టెక్నికల్

టెక్నికల్

ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్‌: వెంక‌ట్‌, క‌ళ‌: కె.వి.ర‌మ‌ణ‌, కూర్పు: గౌతంరాజు, పాట‌లు: భాస్క‌రభ‌ట్ల‌, సంగీతం: ర‌ఘు కుంచె, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌: సాయికార్తిక్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: ఎం.వెంక‌ట‌సాయి సంతోష్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రాంబాబు కుంప‌ట్ల‌, కెమెరా: జ‌గ‌దీష్ చీక‌టి, నిర్మాత‌: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, ప‌ద్మ‌జ మామిడిప‌ల్లి, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: గోవి.

English summary
Nayaki Movie Audio Release Function held at Hyderabad. Nandamuri Balakrishna, Trisha Krishnan, Sushma Raj, Satyam Rajesh, Govi, Giridhar Mamidipally, Padmaja Mamidipally, Raghu Kunche, Raj Kandukuri, Bhaskarabhatla Ravikumar, Singer Malavika, Shilpa Chakravarthy graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu