»   » ఆరంభం: చురకత్తుల్లా నయనతార బికినీ చూపులు(ఫోటోలు)

ఆరంభం: చురకత్తుల్లా నయనతార బికినీ చూపులు(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్లలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న నయనతార త్వరలో 'ఆరంభం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అజిత్, నయనతార, తాప్సి తదితరులు నటించిన ఈ తమిళ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. త్వరలో ఈచిత్రాన్ని తెలుగులో అనువదించి 'ఆట ఆరంభం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా...ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన నయనతార హాట్ అండ్ సెక్సీ బికినీ ఫోటోలు ఆమె అభిమానులను గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె ఓర చూపుల్లోని సెక్సీ తనం అభిమానుల హృదయాల్లో చురకత్తులా గుచ్చుకుంటున్నాయి. ఈ హాట్ ఫోటోలు తప్పకుండా ఎక్కువ మంది అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీసేలా ఉపకరిస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఆరంభం చిత్రంలో హీరోగా నటించిన అజిత్‌కు తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలయింగ్ ఉంది. నయనతార, తాప్సీ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉండటం కూడా సినిమాకు కలిసొచ్చే అంశం. తెలుగు అనువాద హక్కులు నిర్మాత జి.శ్రీను బాబు రూ. 6 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆరంభం చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు.

త్వరలోనే తెలుగు అనువాదంగా విడుదల కాబోతున్న 'ఆరంభం' చిత్ర విశేషాలతో పాటు, నయనతార హాట్ ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం....

ఆరంభం

ఆరంభం


26/11 ముంబై వరుస పేలుళ్ల బ్యాక్ డ్రాప్‌తో రహస్య వ్యక్తి (అజిత్) చుట్టూ ఆరంభం సినిమా కథ నడుస్తుంది.

హాలీవుడ్ కనెక్షన్

హాలీవుడ్ కనెక్షన్

ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందాయి. అయితే కొందరు మాత్రం ఈ చిత్రలో హాలీవుడ్ మూవీ Sword Fish పోలికలు ఉన్నాయని అంటున్నారు.

సినిమాలో ట్విటస్టులు, మలుపులు

సినిమాలో ట్విటస్టులు, మలుపులు


సినిమాలో పలు ట్విస్టులు, మలుపులు ప్రేక్షకుల్లో సినిమాపై అసక్తిని మరింతగా పెంచుతాయి. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ స్కాం ఎపిసోడ్ ఎంతో ఆసక్తి కరంగా సాగుతుంది.

కామెడీ మిస్సైంది

కామెడీ మిస్సైంది

కథా పరంగా సీరియస్‌గా సాగే యాక్షన్ మూవీ కావడంతో సినిమాలో కామెడీ పాళ్లు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లో కామెడీ లేకుండా సినిమాలు నడిచే పరిస్థితి లేని నేపథ్యంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

అజిత్ పెర్ఫార్మెన్స్

అజిత్ పెర్ఫార్మెన్స్


సినిమాలో హీరో అజిత్ పెర్ఫార్మెన్స్ పర్ ఫెక్టుగా ఉండటంతో పాటు, ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటం ప్లస్సయింది.

ఇతర నటీనటులు

ఇతర నటీనటులు


ఈ చిత్రంలో ఆర్య, తెలుగు హీరో రానా మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నయనతార సినిమాలో ఫుల్ గ్లామరస్‌గా కనిపించి అభిమానులకు కనువిందు చేసింది. ఆర్య, తాప్సి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. మహేష్ మంజ్రేకర్, అతుల్ కులకర్ణి, కిషోర్, సుమన్ రంగనాథన్, అక్షర గౌడ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

యువన్ శంకర్ రాజా సంగీతం

యువన్ శంకర్ రాజా సంగీతం


ఆరంభం సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరు హైలెట్‌గా మారింది.

ఇతర టెక్నికల్ డిపార్ట్ మెంట్స్

ఇతర టెక్నికల్ డిపార్ట్ మెంట్స్


సినిమాలో చెప్పుకోదగ్గ మరో అంశం ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ. ఆయన తీసిన కొన్ని స్టైలిష్ షాట్లు ప్రక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్, కొరియోగ్రఫీ, యాక్షన్ విభాగాలు కూడా మంచి పనితీరు కనబర్చాయి.

తెలుగు ఆడియన్స్‌ను ఆరంభం మెప్పిస్తుందా?

తెలుగు ఆడియన్స్‌ను ఆరంభం మెప్పిస్తుందా?


తమిళ బాక్సాఫీసు హిట్ కొట్టిన ‘ఆరంభం' సినిమా తెలుగులోనూ మంచి ఫలితాలు రాబడుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

English summary
Ajith's Arrambam Releasing As Aata Arambham In Telugu. Ajith Kumar, who has given brilliant performance, is featured like a common man, who is fighting against evil forces. Nayantara looks glamorous in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu