»   » మలేషియా అధికారుల అదుపులో హీరోయిన్ నయనతార!

మలేషియా అధికారుల అదుపులో హీరోయిన్ నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ నయనతారను మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఎయిర్ పోర్టు అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పేరుకు, పాస్ పోర్టులో ఉన్న పేరులో కొన్ని తేడాలు ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు కొన్ని టీవీ ఛానల్స్ లో వార్తలు వచ్చాయి.

శుక్రవారం తెల్లవారు ఝాము వరకు ఆమెను పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్, బెంగుళూరులోని తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి హెల్ప్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Nayantara plays a secret agent in ‘Iru Mugan’

తాను నటిస్తున్న ‘ఇరు ముగన్' అనే తమిళ సినిమా షూటింగులో భాగంగా ఆమె మలేషియా వెళ్లారు. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నయనతార సీక్రెట్ ఏజెంటుగా నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆమె అండర్ కవర్ ఏజెంటుగా కనిపిస్తుంది, యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ నిత్యా మీనన్ సెకండ్ లీడింగ్ లేడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ గ్యాపులో నయనతార మలేషియాలోని తన అభిమానులను మీట్ అయ్యారు.

Read more about: nayantara, నయనతార
English summary
According to a TV channel report, Actress Nayantara was arrested by the Kaula Lumpur airport police last night after they found some mismatch of letters in her name in the pass port. Nayantara plays a secret agent in ‘Iru Mugan’. This is the first time Nayanthara has paired up with Vikram, who will be seen in dual roles in the film. Currently being shot in Malaysia, the film is directed by Anand Shankar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu