అలా...నయనతారను ఇబ్బంది పెడుతున్న ప్రభుదేవా!

By Bojja Kumar

హైదరాబాద్: హాట్ హీరోయిన్ నయనతార ఆ మధ్య ప్రభుదేవాతో ప్రేమాయనం నడపడంతో పాటు కొంతకాలం అతనితో కలిసి సహజీవనం కూడా చేసారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా కానీ అనుకోకుండా వీరి మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ విడిపోయారు కదా...? మళ్లీ ఆయన వల్ల ఈవిడ పడుతున్న ఇబ్బంది ఏమిటా అనుకుంటున్నారా...

అసలు సమస్య అంతా నయనతార చేతిమీద ఉన్న టాటూ(పచ్చబొట్టు) మూలంగానే. అప్పట్లో ప్రభుదేవానే సర్వస్వం అనుకున్న నయన ఆయన పేరును పచ్చబొట్టుగా తన చేతిపై వేయించుకుంది. ఆ తర్వాత ఆయనతో విడిపోయానా....ఆమె చేతిపై పచ్చబొట్టు మాత్రం అలానే ఉంది.

అయితే ఇటీవల నయనతార గోపీచంద్ హీరోగా బిగోపాల్ దర్శకత్వంలో సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరుగగా....ఫోటో గ్రాఫర్లంతా ఆమె చేతిపై ఉన్న టాటూను ఫోటోలు తీయడానికి పోటీపడ్డారట. నయనతార అది కనిపించకుండా తన చున్నీతో ఎంత కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. అలా టాటూ మూలంగా ఇబ్బంది ఫీలైందట నయన.

సినిమా వివరాల్లోకి వెళితే...

బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్-నయనతార హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇటీవల అఫీషియల్ గా చెన్నైలో ప్రారంభోత్సవం జరుపుకుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా గురంచి దర్శకుడు మాట్లాడుతూ...'ఇది ద్విబాషా చిత్రం. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాం. యాక్షన్ ఎంటర్టెనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇంతకు మించిన విషయాలేమీ చెప్పలేను. సెప్టెంబర్ 1 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X