»   » నయనతార అడుగు పెట్టిన వేళ..సైరాలో సందడి!

నయనతార అడుగు పెట్టిన వేళ..సైరాలో సందడి!

Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతున్నా సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రం రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ తరహా పాత్రలో నటించడం ఇదే తొలిసారి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా చిత్రీకరించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ చిత్రంలో పేరుమోసిన నటులంతా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా హీరోయిన్ నయనతార సైరా షూటింగ్ లో జాయిన్ అయింది. నయనతార షూట్ కి జాయిన్ కావడం సెట్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. సైరా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా ఈ నెల నుంచే షూట్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు, నాజర్ వంటి ప్రధాన నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Nayanthara joins Sye Raa shoot
English summary
Nayanthara joins Sye Raa shoot. Sye Raa shoot is going on in Hyderabad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X