»   »  ఫోటోలపై నోకామెంట్! నయనతార, శింబు మధ్య మళ్లీ?

ఫోటోలపై నోకామెంట్! నయనతార, శింబు మధ్య మళ్లీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శింబు, నయనతార.. మళ్లీ కలుస్తున్నారా ? వీరి ప్రేమ మళ్లీ చిగురించిదా ? అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ఒకప్పుడు హాట్ హాట్ లవ్ స్టొరీ నడిపిన శింబు, నయనతార విబేధాలు వచ్చి విడిపోయారు. వీరి ప్రేమకు బ్రేక్ పడిన వెంటనే.. మరో కొత్త లవ్ స్టొరీలతో రెడీ అయిపోయారు. నయనతార.. ప్రభుదేవాకు దగ్గరైంది. శింబు.. హన్సిక లవ్ ఎఫైర్ నడిపాడు. అయితే ఈ ప్రేమలు కూడా ఎంతోకాలం నిలవలేదు.

పాత ప్రేమికులైన నయనతార, శింబు ఈ మధ్య మళ్లీ సన్నిహితంగా మెలుగుతుండటం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం శింబు మాజీ ప్రేయసి నయనతారతో మళ్లీ కలిసి నటించడం విశేషం. ఎవరినయినా ప్రేమిస్తానుగానీ శింబును మాత్రం జీవితంలో క్షమించనన్న నయనతార ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా ఉండడం సినీ వర్గాలకే షాక్ కలిగిస్తున్న అంశం.

శింబు ఇటీవల నయనతారతో సన్నిహితంగా ఉండే ఫొటోను తన సెల్‌ఫోన్‌లో బంధించి దాన్ని మరోసారి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ మళ్లీ దగరవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్రిష పుట్టినరోజు వేడుక వీరీ లవ్ స్టొరీ మళ్లీ మొదలైందనడానికి వేదికగా మారింది. ఈ పార్టీలో నయనతార, శింబు కలసి చేసిన సందడి తమిళ సినీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీలో ఒకరినొకరు హత్తుకొని మరీ ఫొటోలకు పోజులిచ్చారు.

ఇప్పుడీ ఫోటోలు నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల ఆధారంగా ఇద్దరూ మళ్లీ ప్రేమలో పడ్డారనే ప్రచారం జరుగుతున్నా, ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందనే వార్తలు వస్తున్నా నయనతార, శింబులు మాత్రం ఖడించకపోవడంతో..... వీరి మధ్య సంథింగ సంథింగ్ మళ్లీ మొదలైందనే వార్తలకు బలం చేకూరినట్లయింది.

త్రిష బర్త్ డేలో...

త్రిష బర్త్ డేలో...

ఇటీవల త్రిష బర్త్ డేలో నయనతార, శింబు ఇలా సన్నిహితంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

స్పందించలేదు...

స్పందించలేదు...


ఈ ఫోటోల ఆధారంగా ఇద్దరి మధ్య మళ్లీ ఎఫైర్ మొదలైనట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఈ ఇద్దరూ ఆ వార్తలను ఖండించక పోవడం గమనార్హం.

అప్పట్లో పీకల్లోతు....

అప్పట్లో పీకల్లోతు....


గతంలో నయనతార, శింబు పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన సంగతి తెలిసిందే.

ముద్దు ఫోటో హల్ చల్...

ముద్దు ఫోటో హల్ చల్...


అప్పట్లో నయనతార, శింబు బెడ్రూంలో రొమాన్స్ చేసుకుంటూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు హల్ చల్ చేసాయి. ఆ ఫోటోలు వారికి ప్రేమికులుగా పాపులర్ చేసాయి.

English summary
Looks like actor Simbu who broke up his relation with Hansika a few months ago has started to rediscover his lost love for his ex girlfriend Nayanthara. The two were spotted partying happily together along with Amala Paul and RJ Ramya at Trisha's birthday party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu