»   » మరీ భయం భయంగా.... నయనతార డోరా ఇక సిద్దం

మరీ భయం భయంగా.... నయనతార డోరా ఇక సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర.సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న హీరోయిన్ నయనతార. అగ్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ ను , పాపులార్టీ ని సంపాదించుకున్న హీరోయిన్..తనకు ఏ రోల్ ఇచ్చిన ఫర్ఫెక్ట్ గా సెట్ అయిపోయే ఈ మలయాళ భామ , తాజాగా డోరా చిత్రం తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. "డోర" ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాలు...

అగ్రకథానాయికలు

అగ్రకథానాయికలు

ప్రస్తుతం తెలుగులో హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. రొమాంచితమైన హారర్ కథాంశాలతో ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేయడమే బాక్సాఫీస్ విజయసూత్రంగా మారిపోయింది. దెయ్యం కథాంశాలకు గ్లామర్ తళుకులను జోడించి సినిమాల్ని రూపొందించే ధోరణి పెరిగిపోయింది. వాణిజ్య పరంగా ఈ చిత్రాలు చక్కటి విజయాల్ని సాధిస్తుండటంతో అగ్రకథానాయికలు సైతం వీటిలో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు.

ట్యాలెంటెడ్ బ్యూటీ నయనతార..

ట్యాలెంటెడ్ బ్యూటీ నయనతార..

సినిమాలను సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసే రేంజ్ కి ఎప్పుడో వచ్చేసింది. పెర్ఫామెన్స్ బేస్డ్ సినిమాలు.. గ్లామర్ రోల్స్ తో పాటు.. హారర్ సినిమాలను కూడా చేసేస్తోంది నయన్. గతేడాది ఈ భామ చేసిన 'మాయ'ను హారర్ చిత్రాల ప్రేమికులు అసలు మర్చిపోలేరు.

హర్రర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో

హర్రర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో

ఇప్పుడో డోరా అంటూ మరోసారి నయన్ మెయిన్ రోల్ లో ఓ సినిమా వస్తోంది. అంతేకాదు, హీరో లేకుండానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. మర్డర్‌ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే హర్రర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో "డోరా" రూపొందుతోందని, ఇందులో రొమాన్స్‌కి చోటు లేదని సమాచారం. మొత్తానికి నయన్ మరో సారి అందరినీ భయపెట్టి ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలాగే ఉంది.

ఈ నెలాఖరులో

ఈ నెలాఖరులో

వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకు చక్కటి స్పందన వస్తోంది.

థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో

థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో

పాటలన్నీ అర్థవంతమైన సాహిత్యంతో ట్రెండీగా వున్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవ్యమైన కథతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆద్యంత.. ఉత్కంఠ ను పంచే విధంగా చిత్రంలోని సన్నివేశాలు వుంటాయి.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి

ఇక నయనతార అంటేనే చక్కటి అభినయానికి పెట్టింది పేరు. ఆమెకు అగ్రహీరోలతో సమానమైన ఇమేజ్ వుంది. దక్షిణాది కథానాయికల్లో నయనతార సూపర్‌స్టార్. అత్యుత్తమ నిర్మాణ విలువలతో డోరా సినిమాను తెరకెక్కించాం. మయూరి తరహాలో ఈ సినిమాతో నయనతార మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

English summary
Dora is an upcoming Indian Tamil-language horror thriller film directed by Doss Ramasamy and produced by A. Sarkunam. It features Nayanthara in the lead role will be Released soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu