»   » భయానకంగా ఉంది: ‘నయీం’ సినిమా పోస్టర్ ట్వీట్ చేసిన వర్మ!

భయానకంగా ఉంది: ‘నయీం’ సినిమా పోస్టర్ ట్వీట్ చేసిన వర్మ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పరిటాల రవి, మద్దెల చెరువు సూరి, వీరప్పన్ లాంటి ఫ్యాక్షన్, క్రమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ల సినిమాలు తీసి తన ప్రత్యేకతను చాటుకున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి తాజాగా గ్యాంగ్‌స్ట‌ర్ నయీం మీద పడింది.

ఇటీవల నయీం పోలీస్ ఎన్ కౌంటర్లో హతం కావడం మీడియాలో సంచలన అయిన సంగతి తెలిసిందే. కిరాతకంగా హత్యలు చేసే క్రిమినల్ గా పేరు తెచ్చుకున్న నయీం.... అంతకు ముందు నక్సలైటుగా, పోలీస్ ఇన్ ఫార్మర్‌గా కూడా పని చేసాడు. అతనికి టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

నయీం జీవితాన్ని తన సినిమా కథగా మార్చుకోవాలని డిసైడైన వర్మ ఇటీవల నయీం మీద సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు కూడా. తాజాగా ట్విట్టర్లో ఓ పోస్టర్ ట్వీట్ చేసాడు. నయీం ఎంత భయంకరంగా హత్యలు చేసాడో..... అంతే భయంకరంగా 'నయీం' మూవీ పోస్టర్ ఉంది.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్

 ఇదే ఆ పోస్టర్

ఇదే ఆ పోస్టర్

అయితే ఈ పోస్టర్ తాను డిజైన్ చేయించింది కాదనీ..... ఇంటర్నెట్లో తన కంట పడిందని, ఆసక్తికరంగా ఉండటంతో ట్వీట్ చేసానని వర్మ చెబుతున్నాడు.

వర్మ

వర్మ

పోస్టర్ ఎవరు డిజైన్ చేసారో తెలియదు కానీ నయీం లోని కిరాతక లక్షణాలన్నీ ఉట్టిపడేలా చాలా బాగా డిజైన్ చేసారు అంటూ వర్మ ప్రశంసించారు.

నయీం

నయీం

భువనగిరిలో సాధారణ వ్యక్తిగా జీవితం మొదలు పెట్టిన నయీం తర్వత నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. తర్వాత నక్సలైట్ల మీద ద్వేషం పెంచుకుని ఉద్యమం నుండి బయటకు వచ్చాడు. నక్సలైట్లను అంతం చేస్తానని ప్రకటించాడు. తర్వాత పోలీస్ ఇన్ఫార్మర్ కొంత కాలం పని చేసాడు. పోలీసులు, రాజకీయ నేతలతో పరిచయాలతో గ్యాంగ్‌స్టర్ గా మారాడు.

ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్

దందాలు సెటిల్మెంట్లు చేస్తూ వేల కోట్ల రూపాయాలు సంపాదించాడు. అయితే ఈ మధ్య కాలంలో నయీం ఆగడాలు ఎక్కువ కావడంతో కొంతకాలంగా అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్లాన్ చేసారు. అయితే పోలీసులను చూసిన నయీం కాల్పులు జరుపడంతో పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ చేసారు.

సినిమాలో

సినిమాలో

నయీం లాంటి సంఘ విద్రోహ శక్తి ఎదగడానికి కారణం ఎవరు? పోలీసులు, రాజకీయ నాయకులు, విలేకరులను అతను ఎలా వాడుకున్నాడు అనేది వర్మ తన సినిమాలో చూపించే అవకాశం ఉంది.

English summary
"Someone made this very innovative design of capturing Nayeem' s deeds in his own name ..look closely at the letters" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu