»   » నీది నాది ఒకే ‘ప్రేమ’ కథ.. ఫీల్ గుడ్ పోస్టర్..నారా రోహిత్ అభిరుచికి..

నీది నాది ఒకే ‘ప్రేమ’ కథ.. ఫీల్ గుడ్ పోస్టర్..నారా రోహిత్ అభిరుచికి..

Written By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లిచూపులు, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలు యువ దర్శకుల ప్రతిభకు, తపనకు సాక్ష్యంగా నిలిచాయి. అదే కోవలో వస్తున్న చిత్రం నీది నాది ఒకే కథ. ఈ చిత్రానికి రచయిత వేణు ఊడుగుల తొలిసారి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఉగాది రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ రిలీజ్

ఉగాది రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ రిలీజ్

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఉగాదిని పురస్కరించుకొని విడుదల చేశారు. ఈ పోస్టర్ నిర్మాత ప్రశాంతి, సమర్పకుడు, హీరో నారా రోహిత్ అభిరుచికి అద్దం పట్టింది.

స్వచ్ఛమైన ప్రేమకథ

స్వచ్ఛమైన ప్రేమకథ

స్కూల్ బ్లాక్‌బోర్డుపై సబ్జెక్టులను కొట్టివేసి రుద్రరాజు సాగర్ పేరుకు టిక్ చేశారు. అంటే ఇది స్వచ్ఛమైన ప్రేమకథ అని దర్శకుడు వేణు ఫస్ట్ లుక్‌లో చెప్పకనే చెప్పేశారు.

అప్పట్లో ఒకడుండేవాడు ఫేం శ్రీ విష్ణు

అప్పట్లో ఒకడుండేవాడు ఫేం శ్రీ విష్ణు

అప్పట్లో ఒకడుండేవాడు ఫేం శ్రీ విష్ణు ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన ప్రతిభను చూపేందుకు సిద్ధమవుతున్నాడు. బిచ్చగాడు చిత్రంలో హీరోయిన్‌గా కనిపించిన శాంతతా టైటస్ ప్రధాన పాత్రను పోషించింది.

సమర్పకుడిగా హీరో నారా రోహిత్

సమర్పకుడిగా హీరో నారా రోహిత్

దర్శకుడు దేవీ ప్రసాద్ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి నిర్మాతలుగా ప్రశాంతి, కృష్ణ విజయ్, సమర్పకుడిగా హీరో నారా రోహిత్ వ్యవహరిస్తున్నారు.

English summary
One more youthful love story from a young lot of passionate artists, technicians is in the offing. Titled Needi Naadi Oke Katha starring Sri Vishnu and Satna Titus in leads is directed by debutant Venu Udugula.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu