twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆందోళన వద్దు, పవన్ పాలిటిక్స్‌పై పంజా నిర్మాత ట్వీట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటం గురించి మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వివిధ మీడియా చానళ్లలో కథనాలు భిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పంజా నిర్మాత నీలిమ తిరుమలశెట్టి ట్వీట్ చేసారు. 'ఎవరూ అయోమయానికి గురి కావద్దు. అంతా ప్రశాంతంగా ఉండండి. త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారు' అని ట్వీట్ చేసారు.

    కాగా....మార్చి రెండో వారంలో రాజకీయాలపై తన అభిప్రాయాన్నీ, పార్టీ స్థాపించే విషయం గురించి, ఎన్నికలలో పోటీ చేసే విషయం గురించి స్వయంగా వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారా? అని మీడియాతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటించడంతో పాటు, ఎలక్షన్ కోడ్ అమలులోకి తేవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇప్పట్లో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ స్థాపించే అవకాశం లేదని అంటున్నారు. మరి ఎన్నికల తర్వాత రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరం.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్-2' చిత్రంతో పాటు ఓమై గాడ్ తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ షూటింగులు పూర్తయ్యేలోగా ఈ సంవత్సరం గడిపోతోంది. ఆ తర్వాత సరైన సమయం, సందర్బాన్ని చూసి పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయా అంశాలపై ఆలోచన చేస్తారని అంటున్నారు.

    English summary
    "Why so much of panic and speculations…please be patient, The Man himself is going to clear the airs right?!" Neelima Tirumalasetti tweet about Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X