»   » రేణు దేశాయ్ షోపై దుష్ప్రచారం, పవన్ మాజీ భార్య కావడం వల్లే....?

రేణు దేశాయ్ షోపై దుష్ప్రచారం, పవన్ మాజీ భార్య కావడం వల్లే....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత పూణెలో సెటిలైన సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా పరిశ్రమలో నిర్మాతగా, దర్శకురాలిగా సినిమాలు చేసిన ఆమె త్వరలో బుల్లితెర డాన్స్ రియాల్టీ షో ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సెప్టెంబర్ 30వ తేదీ నుండి మాటీవీలో ప్రసారం కానున్న 'నీతోనే డాన్స్' అనే డాన్స్ రియాల్టీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించబోతున్నారు. డాన్స్ విత్ రొమాన్స్ కాన్సెప్టుతో హిందీలో ప్రసారం అవుతున్న 'నాచ్ బలియే' తరహాలో ఈ షో ఉంటుందని తెలుస్తోంది.

షో ప్రారంభానికి ముందే దుష్ప్రచారం

షో ప్రారంభానికి ముందే దుష్ప్రచారం

అయితే ఈ షో ప్రారంభానికి ముందే దుష్ప్రచారం మొదలైంది. అసలు ఈ షో ఎలా ఉంటుందో? ఎలాంటి కాన్సెప్టుతో సాగుతుందో కూడా చూడకుండా...? కొందరు సోషల్ మీడియాలో ఇది ‘ప్లాప్ షో' అంటూ నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టారు.

పవన్ భార్య కావడం వల్లే

పవన్ భార్య కావడం వల్లే

అయితే కొందరు పవన్ అభిమానులు... ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై ఎదురు దాడి ప్రారంభించారు. కేవలం పవన్ కళ్యాణ్ మాజీ భార్య కావడం వల్లనే వీరు ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

మరికొందరు ఇలా

మరికొందరు ఇలా

అయితే కొందరి వాదన మరోలా ఉంది. ‘నీతోనే డాన్స్' ప్రోమో చూసి చాలా డిసప్పాయింట్ అయ్యామని, మళ్లీ అవే టీవీ ముఖాలు, వాళ్లతో అయితే డాన్స్ షో సక్సెస్ కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఉదయభాను, లాస్య తదితరులు

ఉదయభాను, లాస్య తదితరులు

‘నీతోనే డాన్స్' రియాల్టీ షో ప్రోమోలో ఉదయభాను, లాస్యతో పాటు మరికొందరు టీవీ నటులు డాన్స్ చేస్తూ కనిపించారు. అయితే ఎప్పుడూ వీళ్లతోనే షో సాగుతుందా? కొత్త వాళ్లకు అవకాశం ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

జానీ మాస్టర్ ఓకే కానీ...

జానీ మాస్టర్ ఓకే కానీ...

జానీ మాస్టర్ అంటే షో బ్లాక్ బస్టర్ అవుతుందని భావించాము, కానీ ఈ సీరియల్ మొహాలతో డాన్స్ రియాల్టీ షో చేస్తే ఆ నమ్మకం పోయింది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ విమర్శలను అధిగమిస్తుందా?

ఈ విమర్శలను అధిగమిస్తుందా?

ఏదైనా ప్రారంభం అయ్యే ముందు ఇలాంటి మామూలే. ప్రశంసలతో పాటు.... ఇలాంటి విమర్శలు కూడా సహజమే. మరి వీటిని అధిగమించి ఈ షో హిట్ అవుతుందా? రేణు దేశాయ్ స్టార్ ఇమేజ్ ఈ షోకు ఏ మేరకు ప్లస్ అవుతుంది అని త్వరలో తేలనుంది.

డాన్స్ అంటే రెండు హృదయాల బాష

డాన్స్ అంటే రెండు హృదయాల బాష

రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరించబోతున్న ‘నీతోనే డాన్స్' షోకు సంబంధించిన అఫీషియల్ ప్రోమోను మాటీవీ వారు విడుదల చేశారు. డాన్స్ అంటే రెండు హృదయాల భాష అంటూ తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు రేణు దేశాయ్. ఆమె చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది కపుల్ డాన్స్ షో అని స్పష్టమవుతోంది.

బిగ్ బాస్ స్థానంలో

బిగ్ బాస్ స్థానంలో

బిగ్ బాస్ మొదటి సీజన్ ముగియడంతో.... శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ‘నీతోనే డాన్స్' రియాల్టీ షో ప్రారంభం కాబోతోంది.

రేణు దేశాయ్ తో పాటు జానీ మాస్టర్, ఆదా శర్మ

రేణు దేశాయ్ తో పాటు జానీ మాస్టర్, ఆదా శర్మ

ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఉంటారని సమాచారం. రేణు దేశాయ్, జానీ మాస్టర్, హీరోయిన్ ఆదా శర్మను న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని సమాచారం.

నీతోనే డాన్స్ ప్రోమో

నీతోనే డాన్స్ రియాల్టీ షోకు సంబంధించిన ప్రోమో ఇదే.

English summary
Neethone Dance is a new dance show, starting from September 3oth. Every Saturday & Sunday at 9 PM on STAR MAA
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu