twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీ నీది ఇంత దిగజారాలా? నాగబాబు పై మెగా ఫ్యాన్స్ విమర్శలు

    నాగబాబు హీరో కాలేకపోయాడు గానీ మంచి నటుడు, ఒకప్పుడు టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకడు, ఇక రోజా సంగతి చెప్పేదేముందీ... అలాంటి సీనియర్ యాక్టర్లు కేవలం ఒక ప్రోగ్రాం కి టీఆర్పీ పెంచటానికి మామూలు అనుభవం .

    |

    జబర్దస్త్ ఒకానొక దశలో ఈ టీవీ సాగదీత సీరియల్స్, పాత సినిమాలూ తప్ప మరేం లేదు అనుకుంటున్న సమయం లో ఒక్కసారి టీఆర్పీ సునామీతో వచ్చిన షో, ఒకప్పుదు కపిల్ నైట్స్, లాఫ్టర్ చాలెంజ్ లాంటి షోలతో హిందీ చానెల్స్ లోనే కనిపించిన షోలు తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాయి అయితే అవన్నీ ఎక్కువ శాతం స్టాండింగ్ కామెడీ మీదే నడిచేవి., అదీ బోరుకొట్టటం తో కపిల్ శర్మ తన ట్వీమ్ తయారు చేసుకొని స్కిట్స్ చేయటం మొదలు పెట్టాడు...

    కమేడియన్ల పాలిటి కల్పవృక్షం

    కమేడియన్ల పాలిటి కల్పవృక్షం

    అదే పేరడీ గా వచ్చిన జబర్దస్త్ ఒక రేంజ్ లో ఈ టీవీ టీఆర్పీని పెంచేసింది, కమేడియన్ల పాలిటి కల్పవృక్షం అయ్యింది, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ఇదే ప్రోగ్రాం కి కొనసాగింపుగా మరో ప్రోగ్రాం కూడా సేమ్ క్రూతో నడుస్తోంది. అయితే ఎంత బెల్లం అయినా రోజూ తింటూంటే బోరుకొడుతుంది కదా...

     బూతు కంటెంట్

    బూతు కంటెంట్

    నెమ్మదిగా టీఆర్పీ తగ్గటం మొదలయ్యింది అంతే మళ్ళీ జనాలని ఆకట్టు కోవటానికి బూతు కంటెంట్ పెంచారు ఇది కస్త వర్కౌట్ అయినా ఆ బూతులని తట్టుకోలేక జనం కూడా సేమ్ బూతులని యూట్యూబ్ అప్లోడెడ్ వీడియోల కింద కమెంట్లలో వాడారు..

    పోటీ పెరిగింది

    పోటీ పెరిగింది

    ఇప్పుడు మరింత పోటీ పెరిగింది మిగతా చానెళ్ళుకూడా ఇవే ఆర్టిస్టులతో అచ్చు ఇలాంటి ప్రోగ్రాంలనే తయారు చేయటం మొదలు పెట్టాయి. ఇప్పుడు జబర్దస్త్ ఆత్మ రక్షణలో పడింది. ఇప్పుడేం చేయాలి మళ్ళీ జబర్దస్త్ కి పూర్వ వైభవం ఎలా తీసుకు రావాలి అని ఆలోచించినప్పుడు. వాళ్ళకి పాత "కాంట్రవర్సీ" ఫార్ములా గుర్తొచ్చింది.

    నిజంగా గొడవ జరిగితే దాన్ని చూపించరు

    నిజంగా గొడవ జరిగితే దాన్ని చూపించరు

    అంతే నాగబాబూ, రోజా, సుడిగాలి సుధీర్ టీమ్ మీద విరుచుకుపడ్డట్టూ, వాళ్లని వెళ్ళిపొమ్మట్టూ ఉన్న క్లిప్పింగ్లని ప్రోమోలో వాడేసారు. అంతటా అదే చర్చ అసలేం జరిగిందీ అన్న ఆసక్తి తోనే జనం ఎదురు చూసారు. అయితే నిజం కొంత అర్థమైన వాళ్ళు మాత్రం "నిజంగా గొడవ జరిగితే దాన్ని చూపించరు" అన్న లాజిక్ తో సమాధాన పడ్డారు. ఎట్టకేలకు ఆ ప్రోగ్రాం వచ్చేసింది. అక్కడ జరిగింది చూసిన జనం "ఓస్ ఇంతేనా" అనుకున్నారు. అయితే మెగా అభిమానులకు మాత్రం ఈ "కాంట్రవర్సీ" అస్సలు నచ్చలేదు.

    టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకడు

    టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకడు

    నిజానికి నాగబాబు హీరో కాలేకపోయాడు గానీ మంచి నటుడు, ఒకప్పుడు టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకడు, ఇక రోజా సంగతి చెప్పేదేముందీ... అలాంటి సీనియర్ యాక్టర్లు కేవలం ఒక ప్రోగ్రాం కి టీఆర్పీ పెంచటానికి మామూలు అనుభవం లేని కమేడియన్ల తోకలిసి "చేస్తే తెలుస్తుంది, స్కిట్ మీరు చేసి చూపించండి" అంటూ ఇలా తమని తాము కించపరిచే మాటలనిపించుకోవటం. అభిమానులకే కాదు మిగతా జనానికి కూడా నచ్చలేదు.

    ఇంత దిగజారిపోతారా అంటూ

    ఇంత దిగజారిపోతారా అంటూ

    ఇక యూట్యూబ్ లో వచ్చే కమెంట్లు నాగబాబు చూడక పోవటమే మంచిది అనే లా ఉన్నాయి... జబర్దస్త్ షోకి మరింత హైప్ తీసుకురావడానికి నాగబాబు -రోజాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో వారిని తప్పుపడుతూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.దీనికోసం నాగబాబు-రోజా ఇంత దిగజారిపోతారా అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.

    English summary
    Evry one Shoked on Naga Babu And Roja Angry On Sudigali Sudheer Team At Extra Jabardasth, Bu ofter watching the show they started Trolling Naga babu anD Mallemala Team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X