»   » 200 మంది అమ్మాయిల్లో పూరి ఫైనల్ చేసింది ఈవిడనే, కొడుకు కోసమే ఇదంతా...

200 మంది అమ్మాయిల్లో పూరి ఫైనల్ చేసింది ఈవిడనే, కొడుకు కోసమే ఇదంతా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్యతో 'పైసా వసూల్' తర్వాత పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. తన తనయుడు ఆకాష్‌ హీరోగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఆకాష్ సరసన హీరోయిన్‌ కోసం పూరి దాదాపు 200 మంది కొత్త అమ్మాయిలను ఆడిషన్ చేశారు.

200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత, ఫైనల్‌గా ఒక అమ్మాయిని ఎంపిక చేశారని, ఆమె పేరు 'నేహా శెట్టి' అని తెలుస్తోంది. ఈవిడపై ఫోటో షూట్, ట్రయల్ షూట్ కూడా నిర్వహించి తన సినిమాకు సూటవ్వడంతో పాటు, ఆకాష్‌కు కూడా సరిజోడిగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

నేహా శెట్టి

నేహా శెట్టి

నేహా శెట్టి కర్నాటకకు చెందిన అమ్మాయి. కన్నడలో ఇప్పటికే 'ముంగారు మలే 2' అనే సినిమాలో నటించింది. ఇపుడు ఆకాష్ పూరి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

మిస్ మంగుళూరు పజంట్

మిస్ మంగుళూరు పజంట్

నేహా శెట్టి.... మంగుళూరు అందాలపోటీల్లో నెగ్గింది. మిస్ మంగుళూరు పజెంట్ అనే టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాని తర్వాత ఆమె సినిమా రంగం వైపు అడుగులు వేశారు.

పూరి స్టైల్ మేకింగ్

పూరి స్టైల్ మేకింగ్

పూరి స్టైల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సారి తన కొడుకు సినిమా కావడం, అతడి భవిష్యత్తును నిర్ణయించే సినిమా కావడంతో పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆకాష్ పూరి

ఆకాష్ పూరి

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆకాష్ 2015లో హీరోగా చేసిన ‘ఆంధ్రపోరి' సినమా అంతగా సక్సెస్ కాకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ఆకాష్ నటనతో పాటు డాన్స్, యాక్షన్, హార్స్ రైడింగ్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడు.

అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయన సినిమా కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో. ఈ సారి సొంత కొడుకుతోనే సినిమా చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

English summary
Neha Shetty of Mungaru Male 2 fame has been roped in to play the leading lady in Puri Jagannadh's forthcoming film. The Kannada actress will be paired opposite his son, Aakash, in the action-drama. Apparently, the director had to audition over 200 girls before zeroing on the Miss Mangaluru pageant winner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu