»   » కార్లు, బంగళాలపై కాదు.... ప్రభాస్ దేనిపై భారీగా ఖర్చు చేసాడో తెలుసా?

కార్లు, బంగళాలపై కాదు.... ప్రభాస్ దేనిపై భారీగా ఖర్చు చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా తర్వాత ప్రభాస్.... నేషనల్ వైడ్ హాట్‌రోబ్ అయిపోయాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... ఇలా దేశంలోని అన్ని పరిశ్రమల్లోనూ ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ప్రభాస్ మీద ఉన్న క్రేజ్ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బాలీవుడ్ వెబ్ సైట్లు, పత్రికలు ప్రభాస్ గురించి కొత్త వార్తలు, ఆసక్తికర విషయాలతో కూడిన కథనాలను బాలీవుడ్ ప్రేక్షకలకు వండి వడ్డిస్తోంది. తాజాగా ప్రభాస్ తన సంపాదనలో ఎక్కువ దేనిమీద ఖర్చు చేస్తున్నారనే విషయమై ఓ పత్రిక ఆసక్తికర కథనం రాసింది.


సొంతగా సాండ్ వాలీబాల్ కోర్ట్

సొంతగా సాండ్ వాలీబాల్ కోర్ట్

ప్రభాస్ సొంతగా సంపాదించుకున్న ఆస్తుల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సాండ్ వాలీబాల్ కోర్ట్. హైదరాబాద్ లోనే ఇది ఉంది. దీని కోసం ప్రభాస్ భారీగా ఖర్చు పెట్టాడని పింక్ విల్లా అనే వెబ్ సైట్ రాసుకొచ్చింది.


ఎక్కువగా ఇక్కడే గడుపుతారు

ఎక్కువగా ఇక్కడే గడుపుతారు

ప్రభాస్ తన సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో కలిసి సాండ్ వాలీబాల్ కోర్టులోనే గడుపుతారని, తన సమయాన్ని, ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని ఆ కథనం బట్టి తెలుస్తోంది.


ఔట్ డోర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం

ఔట్ డోర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం

ప్రభాస్ ఫిట్ గా ఉండటం కోసం ఇతర యాక్టర్ల మాదిరిగా జిమ్ లో గడపటం కాకుండా.... ఔట్ డోర్ స్పోర్ట్స్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతారని, ఆ ఇష్టంతోనే స్నేహితులతో కలిసి సరదాగా గడపటానికి సొంతగా సాండ్ వాలీబాల్ కోర్టు కట్టించుకున్నాడని సమాచారం.


వాలీ బాల్ గురించి ప్రభాస్

వాలీ బాల్ గురించి ప్రభాస్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.... ‘నాకు వాలీబాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడటానికే సమయం కేటాయిస్తాను' అని తెలిపారు.


ఓపెన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం

ఓపెన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం

ఓపెన్ ఎన్విరాన్మెంటులో గడపటానికి ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడతారు. ఫిట్ నెస్ కోసం ట్రెక్కింగ్ లాంటివి చేయడం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. చాలా మంది తెలుగు అభిమానులకు కూడా ప్రభాస్ గురించిన ఈ విషయం తెలియదు.


ఆ విషయం మీకు తెలుసా?

ఆ విషయం మీకు తెలుసా?

ప్రభాస్ కు పుస్తకాలు చదవడం అంటే కూడా చాలా ఇష్టం. ఇంట్లో ప్రభాస్ కంటూ పర్సనల్ లైబ్రరీ ఒకటి ఉంది.


రాక్ క్లైబింగ్ అంటే ఇష్టం

రాక్ క్లైబింగ్ అంటే ఇష్టం

దీంతో పాటు ప్రభాస్ కు రాక్ క్లైబింగ్ అంటే కూడా చాలా ఇష్టం. బాహుబలి-2లో ప్రభాస్ అంత ఫిట్ గా ఉండటానికి రాక్ క్లైబింగ్ కూడా ఎంతో తోడ్పడింది.


ప్రభాస్ చాలా సిగ్గరి

ప్రభాస్ చాలా సిగ్గరి

ప్రభాస్ మీద టాలీవుడో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు, గాసిప్స్ లేవు. అంతే కాదు చాలా మొహమాటస్తుడు, సిగ్గరి కూడా.English summary
Prabhas is the newest heartthrob of the entire nation! From kids to elders, everybody is just going gaga over him and they look forward to each and every update related to him. So what's new? Well, we came to know about the most expensive possession of Prabhas and you will be surprised to know that it's neither bungalow nor any car. So what is it? Read on to find out..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu