»   » రామానాయుడు ‘నేనేం చిన్న పిల్లనా?’(ఫోటోలు)

రామానాయుడు ‘నేనేం చిన్న పిల్లనా?’(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం 'నేనేం చిన్నపిల్లనా?' ఆడియో వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో వెంకటేష్ ఆడియో సీడీ విడుదల చేసి రానా, రామానాయుడుకు అందజేశారు.

రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా నటిస్తున్న ఈచిత్రాన్ని పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ- మంచి బాణీలతో ఆరు పాటలు ఇందులో ఉన్నాయని, ఆడియో హిట్ అయి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు వస్తుందని తెలిపారు. చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదం పంచే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఆడియో వేడుకకు సంబంధించిన పోటోలతో పాటు, సినిమా గురించి దర్శకుడు మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

ఆడియో ఆవిష్కరణ

ఆడియో ఆవిష్కరణ

నేనేం చిన్న పిల్లనా? ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రామానాయుడు, హీరోలు వెంకటేష్, రాణా. కథానాయకుడు రాహుల్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖలను కూడా ఈ దృశ్యంలో చూడొచ్చు.

సీడీలు విడుదల చేసిన వెంకటేష్

సీడీలు విడుదల చేసిన వెంకటేష్

ఆడియో సీడీలను హీరో వెంకటేష్ విడుదల చేసి నిర్మాత రామానాయుడు, హీరో రాణాలకు అందజేసారు. మంచి బాణీలతో ఆరు పాటలు ఇందులో ఉన్నాయని, ఆడియో హిట్ అయి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు వస్తుందని నిర్మాత తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

స్వేచ్ఛ కోరుకునే ఓ యువతి సమాజంలో కొందరి వ్యక్తులను కలిసినపుడు ఎటువంటి అపోహలకు గురైందీ, ఆ తర్వాత పరిణామాలేంటి అన్న అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, పెద్ద సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించినందుకు సంతోషంగా ఉందని దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

కథకు సరైన పేరుగా అందరూ ఒప్పుకుంటారని సంగీత దర్శకురాలు శ్రీలేఖ తెలిపారు. కార్యక్రమంలో తన్వి వ్యాస్, రాహుల్, భాస్కరభట్ల, శరత్‌బాబు, సత్యానంద్, వనమాలి, అనంత్ శ్రీరామ్, ఎల్బీ శ్రీరామ్, అన్నపూర్ణ, మార్తాండ్ కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సుమన్, అలీ, ఏవిఎస్, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, జీవా, వేణుమాధవ్, ఉత్తేజ్, శివారెడ్డి, సంజన నటిస్తున్నారు.

English summary
Nenem Chinna Pillana? movie audio launched. Rahul Ravindran and Tanvi Vyas are playing lead roles in "Nenem Chinna Pillana" movie. This Movie is directed by Sunil Kumar Reddy and produced by D.Rama Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu