»   » సురేష్‌ ప్రొడక్షన్స్‌ 'నేనేం చిన్న పిల్లనా' రిలీజ్ ఖరారు

సురేష్‌ ప్రొడక్షన్స్‌ 'నేనేం చిన్న పిల్లనా' రిలీజ్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాహుల్‌, తన్వీ వ్యాస్‌ జంటగా తెరకెక్కిన సినిమా 'నేనేం చిన్నపిల్లనా'. సునీల్‌ కుమార్‌రెడ్డి దర్శకుడు. డా||డి.రామానాయుడు నిర్మాత. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై డా||డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

దర్శకుడు మాట్లాడుతూ ''నా జీవితం నా ఇష్టం. నాకు నేను నిర్ణయాలు తీసుకోగలను అనుకునే స్వప్న అనే అమ్మాయి కథ ఇది. స్వప్న జీవితంలో క్రిష్‌ పాత్ర ఏమిటి అనేది తెరపైనే చూడాలి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమాని తెరకెక్కించాము. కుటుంబ విలువలతో తెరకెక్కిన చిత్రమిది. ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు యూత్‌ ఆడియన్స్‌కి కూడా బాగా కనెక్ట్‌ అవుతుంది. సురేష్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ విలువలు మిస్‌ కాకుండా టెక్నికల్‌గా చాలా గ్రాండ్‌గా తీశాం.

హైదరాబాద్‌, వైజాగ్‌ స్వీడన్‌, డెన్మార్క్‌ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఇటీవలె విడుదలైన పాటలకు, ట్రైలర్‌లకు చక్కని స్పందన లభించింది. శ్రీలేఖ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఆర్‌.ఆర్‌ కూడా బాగా కుదిరింది. ప్రతి ఆరిస్ట్‌ పాత్రకీ విలువ కనిపిస్తుంది. నా గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వచ్చిన హిట్‌ చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని నమ్మకంగా చెప్పగలను''అన్నారు.

డా||రామానాయుడు మాట్లాడుతూ.. 'సునీల్‌కుమార్‌ రెడ్డి మా బ్యానర్‌లో చేస్నున్న మొదటి చిత్రమిది. టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుండి సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. బలభద్రపాత్రుని రమణి కథకు సత్యానంద్‌ అద్భుతమైన మాటలు రాశారు. సినిమా సూపర్‌హిట్‌ కావాలనే ఉద్ధేశ్యంతో అందరూ చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. తన్వికిది మొదటి చిత్రమైనప్పటికీ బాగా యాక్ట్‌ చేసింది. ఈ సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలొస్తాయి. శ్రీలేఖ సంగీతం సినిమాకి మరో హైలైట్‌ అని చెప్పొచ్చు. రెండేళ్ళ గ్యాప్‌ తరువాత మా బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంధ్ర, తమిళనాడు, బెంగుళూరు ప్రాంతాల్లో ఈ నెల 26న విడుదల చేస్తున్నాము'అని తెలిపారు.

సురేష్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నటిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని నటి తన్వి తెలిపారు. మంచి విలువలున్న సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో హీరోగా చేశానని జీవితాంతం గర్వంగా చెప్పుకుంటానని రాహులు చెప్పారు. 'మధుమాసం' చిత్రం తరువాత ఈ బ్యానర్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రచయిత బలభద్రపాత్రుని రమణి తెలిపారు.

అన్నపూర్ణమ్మ, సన, ఏవీఎస్‌, ఎల్బీ శ్రీరామ్‌, జయప్రకాష్‌రెడ్డి, కాశీవిశ్వనాధ్‌, ఆమని, శరత్‌బాబు, గాయత్రి, మహేష్‌, బేబీ అంజలి, రాగిని. రఘుబాబు, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:బలభద్రపాత్రుని రమణి, మాటలు:సత్యానంద్‌, కెమెరా: సాబుజేమ్స్‌, సంగీతం:యం.యం శ్రీలేఖ, లిరిక్స్‌:అనంత శ్రీరామ్‌, వనమాలి, భాస్కరభట్ల, నిర్మాత: డి.రామానాయుడు, దర్శకత్వం: పి సునీల్‌కుమార్‌రెడ్డి.

English summary
Nenem Chinna Pillana features Rahul Ravindran (Andala Rakshasi fame), debutant Tanvi Vyas (Former Miss India Earth, 2008) and Sanjjanaa in the lead roles. The release date has been confirmed and the movie will be hitting the screens on September 26th, 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu