»   » హ్యాపీగా నవ్వుకుంటున్నారు.. నేను కిడ్నాప్ అయ్యాను సక్సెస్ మీట్

హ్యాపీగా నవ్వుకుంటున్నారు.. నేను కిడ్నాప్ అయ్యాను సక్సెస్ మీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను కిడ్నాప్ అయ్యాను చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ రావడం తో ఈ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా.. నిర్మాత మాధవి, దర్శకుడు శ్రీకర్ బాబు, హీరోయిన్ బింగ్, కొరియోగ్రాఫర్ తదితరులు మాట్లాడారు.

నిర్మాత మాధవి మాట్లాడుతూ దర్శకుడు శ్రీకర్ చెప్పిన కథ నచ్చి సినిమా చేశాం. తను ఫెంటాస్టిక్ డైరెక్టర్. చెప్పినట్టు తీయడం తో సినిమా మంచి విజయం సాధించింది. సినిమా చూస్తున్న రెండుగంటలు హ్యాపీ గా నవ్వుకుంటున్నారు. సినిమా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీక‌ర్ బాబు మాట్లాడుతూ మా ఈ సినిమా చూసి ఆదరించిన ప్రతి ప్రేక్షకునికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. అక్టోబర్ 6న విడుదలైన నేను కిడ్నాప్ అయ్యాను చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందం గా ఉంది. తనకు తెలియకుండానే కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందో అనే సైకాలాజిక‌ల్ కిడ్నాప్ బేస్డ్ స్టోరీ. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షుకులు అల‌రిస్తుంది అన్నారు.

Nenu Kidnap Ayyanu success meet

హీరోయిన్ బిందు మాట్లాడుతూ మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది, పూర్తి కామెడీ ని పంచిన ఈ మా చిత్రాన్ని మరింత సపోర్ట్ చేయాలని ప్రేక్షుకులను కోరుతున్నా అన్నారు.

కొరియో గ్రాఫర్ జో జో మాట్లాడుతూ హెల్తీ కామెడీ, రెగ్యులర్ జోనర్ కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షుకులకు నా కృతజ్ఞతలు అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ ప్రాంతం లో కలెక్షన్స్ బాగొస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది, సినిమాను అందరూ ఆదరిస్తున్నారు, నాకు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు అని తెలియచేసారు.

English summary
Nenu Kidnap Ayyanu movie is released recently. In this event Movie maker organised success meet. Producer Madhavi, Director Srikar Babu, Heroine Bindu are participated in this success meet. They said .. Nenu Kidnap Ayyanu movie getting good response from the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu