»   » చచ్చిపోతే ఏమౌతుంది? ('నేనూ..నా రాక్షసి' ప్రివ్యూ)

చచ్చిపోతే ఏమౌతుంది? ('నేనూ..నా రాక్షసి' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన నేనూ..నా రాక్షసి చిత్రం ఈ రోజు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఫెరఫెక్ట్ ప్లానింగ్ తో మర్డర్స్ చేసే ప్రొఫెషనల్ కిల్లర్ అభిమన్యు (రాణా). వృత్తిలో భాగంగా ఎంతట సమస్యను అయినా సాహసింతో ఎదుర్కొంటూంటాడు. ఇక మీనాక్షి (ఇలియానా)అందంతోపాటు తెలివితేటలున్న నేటితరం యువతి. ఓ సమస్యతో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తుంటుంది. ఓ రోజు అనుకోకుండా అభిమన్యుకి మీనాక్షి తారసపడుతుంది. వారిద్దరి కలయిక ఏ పరిస్థితులకు దారి తీసింది. అసలు మీనాక్షి సమస్యేమిటి? వారిద్దరి మధ్య జరిగే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనే విషయాల్ని తెరపైనే చూడాలి అంటున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ..ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది. అసాధారణంగా ప్రవర్తించే రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది. ఆ పాత్రల చిత్రణ అందరికీ నచ్చుతుంది. వెనిస్‌లో చిత్రించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలీ, ముమైత్‌ఖాన్‌ కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. నేను బాగా ఇష్టపడి రాసుకొన్న కథ ఇది అంటున్నారు.

సంస్థ: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌
నటీనటులు: రాణా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, అభిమన్యు సింగ్‌, ముమైత్‌ఖాన్‌ తదితరులు
సంగీతం: విశ్వ-రెహమాన్‌
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి)
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

English summary
Puri Jagannath stated that Ileana has given her career best performance in Nenu Naa Rakshasi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu