»   » నయనతార 'నేనూ రౌడీనే' ట్రైలర్

నయనతార 'నేనూ రౌడీనే' ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నయనతార, విజయ్ సేథుపతి హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం 'నానుం రౌడీదాన్'. అక్టోబర్ 21న తమిళనాట విడుదలైన ఈ సినిమాలో తన అభినయంతో విజయ్ సేథుపతిని మింగేసిందట నయనతార. హీరో ధనుష్ నిర్మించిన ఈ సినిమాని విగ్నేష్ శివన్ తెరకెక్కించారు.

ప్రస్తుతం ఈ సినిమాని కల్పన చిత్ర, స్నేహ మూవీస్ సంస్థలు 'నేనూ రౌడీనే' పేరుతో తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ పనులు తుది దశలో వున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ...నయనతార ప్రధాన పాత్రలో నటించడం, హీరో ధనుష్‌ నిర్మించడం, కొలవరి ఫేమ్‌ అనిరుధ్‌ సంగీతాన్ని అందించడంతో సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. అనిరుధ్‌ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. తెలుగులో కూడా ఆడియో పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం వుంది. నయనతార అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలోనే తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా అన్నారు నిర్మాతలు.

నయనతార, విజరు సేతుపతి, పార్తీబన్‌, రాధిక, ఆర్‌.జె.బాలాజీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి.విలియమ్స్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, నిర్మాతలు: కోనేరు కల్పన, రమేష్‌ అన్నమరెడ్డి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్‌.

English summary
Nenu Rowdy Ne (Naanum Rowdy Dhaan) Movie Theatrical Trailer released. This movie starring Vijay Sethupathi, Nayantara, Parthiban, Raadhika, RJ Balaji, Meenakshi and others. Directed by Vignesh Shivan. Produced by Koneru Kalapna and Rameshannam Reddy. Music by Anirudh Ravichander.
Please Wait while comments are loading...