»   » నేపాల్ భూకంపం : ‘ఎటకారం’ విజయ్ మృతి

నేపాల్ భూకంపం : ‘ఎటకారం’ విజయ్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : షూటింగ్‌ కోసం నేపాల్‌ వెళ్లిన ఎటకారం సినిమా యూనిట్‌ ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోగా ఓ విషాద వార్త తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోగా చేసిన విజయ్ మృతి చెందారు. 25 సంవత్సరాల వయస్సు ఉన్న విజయ్ కు ఇదే తొలి చిత్రం. భూకంపంలో కారు తిరగబడి మృతి చెందినట్లు మీడియా వర్గాల సమాచారం.

అయితే ... మరో ప్రక్క చనిపోయింది హీరో కాదని... 'వెటకారం' చిత్ర నృత్యదర్శకుడు విజయ్‌ మృతి చెందారని మీడియోలో కధనాలు వస్తున్నాయి. ఈ విషయమై కొద్దిగా గందలగోళపరిస్ధితి నెలకొని ఉంది.. నేపాల్‌లో సంభవించిన భూకంపం ధాటికి విజయ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ మృతి చెందినట్లు సమాచారం. విజయ్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎటకారం సినిమా యూనిట్‌ను దురదృష్టం వెంటాడింది. షూటింగ్‌ కోసం నేపాల్‌ వెళ్లిన సినిమా బృందం శనివారం అక్కడ సంభవించిన భూకంపంలో చిక్కుకుపోయింది. వారి ఆచూకీ గల్లంతు కావడంతోపాటు ఫోన్లు పనిచేయకపోవడంతో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో మునిగిపోయారు. అయితే అదే రోజు రాత్రి వారు క్షేమంగా ఉన్నట్టు ఇక్కడికి సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

భూకంపం నుంచి తృటిలో బయటపడి తప్పించుకున్న యూనిట్‌ బృందం ఖాట్మాండు నుంచి కారులో తిరిగి వస్తుండగా మరోసారి దురదృష్టం వెంటాడింది. ఈరోజు ఉదయం మరోమారు భూకంపం సంభవించడంతో నూతన నటుడు విజయ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి దొర్లిపోయింది. ప్రమాదంలో విజయ్‌ మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్‌ మృతితో ఆయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్లలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఈ చిత్రం షూటింగ్‌ కోసం 20మంది సభ్యుల బృందం నేపాల్‌ వెళ్లింది. ఈ రోజు అక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా వారు అక్కడే చిక్కుకుపోయారు. విద్యుత్‌, టెలిఫోన్‌ వ్యవస్థలన్నీ అస్తవ్యస్థం కావడంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. బృందంలోని ఏ ఒక్కరి ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే నిన్నటికి అందిన వార్త ప్రకారం...యూనిట్ అంతా క్షేమం అన్నారు. అయితే ఈ లోగా ఈ విషాద వార్త వచ్చింది.

Nepal Earthquake: Telugu Film Unit of 'Yetakaram.com' hero died

నేపాల్‌ వెళ్లిన బృందంలో డైరెక్టర్‌ వీరేందర్‌రెడ్డి, హీరో దినేష్‌, హీరోయిన్‌ హరిత, కెమెరామన్‌ రంజిత్‌, టెక్నీషియన్లు భరత్‌, విజయ్‌, నవీన్‌ తదితరులు ఉన్నారు.

భూకంపం ధాటికి విలవిల్లాడిన నేపాల్‌ భయంతో బిక్కుబిక్కుమంటోంది. ప్రకంపనల భయంతో ప్రజలంతా చలి రాత్రిలోనూ ఆరు బయటే ఉన్నారు. పులి మీద పుట్రలా వర్షం ముంచెత్తుతోంది. శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాలతో ఉన్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. స్థానికులు, పర్యాటకులు కూడా తోడ్పాటునందిస్తున్నారు. అయితే తాజా ప్రకంపనలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, పర్వతాల్లో హిమపాతంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

హోంశాఖకు తాజాగా అందిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 2,430కు పెరిగింది. ఒక్క కాఠ్‌మాండూ లోయలోనే 1,053 మంది మరణించారని తేలింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. మృతుల్లో ఐదుగురు భారతీయులున్నారని అధికారులు వెల్లడించారు. అందులో భారత దౌత్యకార్యాలయం ఉద్యోగి కుమార్తె ఒకరు. మృతుల సంఖ్య పెరిగిపోతుండడంతో సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.

ఆదివారం 6.7, 6.5, 5.4 తీవ్రతతో వరుసగా మూడు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. శనివారం వచ్చిన భారీ భూకంపం, ఆదివారం వచ్చిన రెండు బలమైన ప్రకంపనాలతో హిమాలయ దేశం శిథిలాల మయమయింది. దాదాపు 30లక్షల మంది నివాసముండే దేశ రాజధాని కాఠ్‌మాండూలో వీధులన్నీ కూలిన భవంతులతో కనిపించాయి. విద్యుత్తు తీగలు తెగిపోయి, విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో దేశమంతా అంధకారం నెలకొని ఉంది. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు మరి కొన్ని రోజులు పట్టవచ్చని అధికారులు చెప్పారు.

అంతర్జాలం, మొబైల్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బ తినడంతో సమాచారం అందక తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. నేపాల్‌లో మొత్తం 26 జిల్లాలపై భూకంపం ప్రభావం తీవ్రంగా ఉంది. క్షతగాత్రులు వేల సంఖ్యలో ఉండడంతో వారందరినీ చేర్చుకోవడానికి ఆస్పత్రుల సామర్థ్యం చాలడం లేదు. ఆస్పత్రుల్లో నేలపైన, ఆస్పత్రుల ఆరుబయట కూడా పడి ఉన్నారు. ఎవరెస్టు శిఖరంపై భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 22 మంది మరణించారు.

తాజా ప్రకంపనలతో త్రిశూలీ జల విద్యుత్తు ప్రాజెక్టు వద్ద సొరంగం కూలి 60 మంది కూలీలు చిక్కుకుపోయారని తెలుస్తోంది. నేపాల్‌ సందర్శనకు వెళ్లిన పలువురు భారతీయులు ఆహారం, పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

English summary
Telugu comedy film "Yetakaram.com" has reportedly gone missing during Saturday's earthquake in Kathmandu, Nepal.
Please Wait while comments are loading...