»   » డోంట్ వర్రీ...యూనిట్ అంతా క్షేమమే

డోంట్ వర్రీ...యూనిట్ అంతా క్షేమమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం వల్ల అక్కడికి షూటింగ్ జరుపుకోవటానికి వెళ్లిన తెలుగు సినిమా 'ఎటకారం' యూనిట్‌పైనా ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి భూకంపం వల్ల చిక్కుకుపోయిన యూనిట్ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం పాటలను కొన్నిరోజులుగా కఠ్మాండులో చిత్రీకరిస్తున్నారు. భూకంపం సంభవించిన ప్రదే శానికి దగ్గరలోనే షూటింగ్ జరుగుతోంది. దీంతో హీరో, హీరోయిన్లతోపాటు 20 మంది చిత్ర బృందం భూకంప ప్రమాదంలో చిక్కుకున్నారు. తొలుత వీరి ఆచూకీ తెలియలేదు. చివరకు వీరంతా క్షేమంగా ఉన్నట్లు శనివారం రాత్రికి సమాచారం అందింది.

‘వెటకారం.కామ్' చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్న కుమారుడైన వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగులో భాగంగా చిత్ర యూనిట్ నేపాల్ వెళ్లారు. భూకంపం రాగానే ఎవరి ఫోన్లూ పని చేయడం లేదు, అక్కడ ఏమైందో తెలియక బంధువులు ఆందోళన చెందారు.

Nepal Earthquake: Tollywood film unit Safe

భూకంప విధ్వంసం.. విషయానికి వస్తే...

నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నగరం కాఠ్‌మాండూకు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు ఎత్త్తెన భవనాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల నుంచి భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య 1500కు చేరినట్లు సమాచారం. కాఠ్‌మాండూ వీధులన్నీ ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో పూర్తిగా నిండిపోయాయి.

అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్తు, సమాచార, రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శనివారం ఉదయం 11.41 నిమిషాలకు సుమారుగా నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్లు గుర్తించారు. భూప్రకంపనల కారణంగా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌, బంగ్లాదేశ్‌, మలేసియాల్లోనూ కన్పించింది.

భారీగా ఆస్తి, ప్రాణ నష్టం..

భూకంపం ధాటికి నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. భవనాలు, గోడలు పెద్దఎత్తున కూలిపోవటం వల్ల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. కాఠ్‌మాండూలోని పాత నగరంలో భూకంప ప్రభావం అధికంగా ఉంది.భూకంపం తీవ్రతకు పురాతన, చారిత్రక కట్టడాలతో పాటు నేపాల్‌ రాజకోటను ఆనుకొని ఉన్న గోడలు సైతం కూలిపోయాయి. దాదాపు 500మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో సంభవించిన భారీ భూకంపం నుంచి 25మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. భూకంప తీవ్రతకు నేపాల్‌ కకావికలమైంది. భూకంపం సంభవించినప్పుడు తామంతా హోటల్‌లో ఉన్నామని యాత్రికుడు గౌరి తెలిపారు. తామంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగో అంతస్తు నుంచి బయటకు పరుగులు తీశామని వివరించారు. ప్రస్తుతం వీరంతా పశుపతినాథ్‌ దేవాలయం వద్ద సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

English summary
All we know...Nepal Earthquake has caused serious damage, in terms of loss in property and lives, with 1500 people reported dead. A Telugu Cinema Vetakaram.com unit members have been in Nepal for shooting are caught in earthquake. The unit members, around 20 members have gone to Kathmandu for shooting of 10 days. The film unit members tried reaching them on phones, but there is no answer, due to which they are worried. Now they are all safe.
Please Wait while comments are loading...