»   » బాహుబలి రిలీజ్‌కు ముందు ఆందోళనగా ఉంది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

బాహుబలి రిలీజ్‌కు ముందు ఆందోళనగా ఉంది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ట్రైలర్ రిలీజ్‌కు ముందు కొంత ఆందోళనగా ఉందని నిర్మాత శోభు యార్లగడ్డ బుధవారం ఓ ఆంగ్ల దినపత్రికతో అన్నారు. బాహుబలి ది బిగినింగ్ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో బాహుబలి ది కన్‌క్లూజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల కానున్నది.

రిలీజ్ అంతా సిద్ధం

బాహుబలి ట్రైలర్ విడుదలకు అంత సిద్ధమైంది. ట్రైలర్‌తోపాటు సెన్సార్ సర్టిఫికెట్ జత చేస్తున్నాం. ట్రైలర్‌కు ముందు రోజు ఎన్నడూలేని కొంత ఆందోళన కలుగుతున్నది. మీ అందరికీ ట్రైలర్ నచ్చుతుందని అనుకొంటున్నాను అని శోభు యార్లగడ్డ వెల్లడించారు.


ట్రైలర్‌తో సెన్సార్ సర్టిఫికెట్

ట్రైలర్‌తో సెన్సార్ సర్టిఫికెట్

బాహుబలి2 చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్‌ను ట్రైలర్‌తోపాటు జతచేస్తున్నారు. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 20 సెకన్లు.


250 థియేటర్లలో విడుదల

250 థియేటర్లలో విడుదల

మార్చి 16 గురువారం ఉదయం 9 ఉదయం నుంచి 10 గంటల మధ్య ట్రైలర్ విడుదల కానున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 250 థియేటర్లలో విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

అత్యంత ప్రతిష్ఠాత్యకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.


English summary
Producer Shobu Yarlagadda said he is "slightly" nervous ahead of the release of the trailer of "Baahubali: The Conclusion" on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu