మహేశ్ బాబు సినిమాలో అనుష్క: అసలు విషయం తెలిసి నోరెళ్లబెడుతోన్న ఫ్యాన్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను'తో భారీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తీసిన 'మహర్షి'తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ మధ్య అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ గురించి తాజాగా బయటకు వచ్చిన ఓ న్యూస్ కలకలం రేపుతోంది.

కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి కీలక పాత్రను పోషిస్తుందని తాజాగా ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందునా అది దర్శకుడు పరశురాం పోస్ట్ చేసినట్లు ఉండడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. కానీ, ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది.

అసలేం జరిగిందంటే.. పరశురాం పెట్లా అనే పేరుతో ఓ నెటిజన్ ట్విట్టర్‌లో అకౌంట్ క్రియేట్ చేశాడు. అది కూడా అచ్చం ఆ దర్శకుడి అధికారిక ఖాతాలాగే మెయింటైన్ చేశాడు. దీంతో అనుష్క వార్తను నిజమేనని అంతా నమ్మేశారు. ఇప్పుడు అసలు విషయం బయటకు రావడంతో అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

 Netizen Create Buzz on Mahesh Babus Sarkaru Vaari Paata

ఇదిలాఉండగా, వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో బ్యాంకులను మోసం చేస్తున్న బడా బాబులను టార్గెట్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X