For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటి హరితేజకు చేదు అనుభవం: డెలివరీ ఎలా అయింది? పాలు ఎలా ఇస్తున్నావ్ అంటూ దారుణంగా!

  |

  తెలుగు బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును అందుకుంది హరితేజ. సీరియల్ నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత యాంకర్‌గా మారి తన సత్తాను నిరూపించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్యనే ఓ బిడ్డకు తల్లైన ఈమె.. ప్రస్తుతం ఆ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా టాలెంటెడ్ నటి హరితేజకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అలా మొదలైన హరితేజ ప్రయాణం

  అలా మొదలైన హరితేజ ప్రయాణం

  కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఆరంభించింది హరితేజ. ఈ క్రమంలోనే యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే 'మనసు మమత' అనే సీరియల్‌లో నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' సహా పలు సీరియళ్లలో నటించి సత్తా చాటింది.

  యాంకర్‌గా మారింది.. ఆ షోతో సత్తా

  యాంకర్‌గా మారింది.. ఆ షోతో సత్తా

  వరుసగా టీవీ సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే 'అభిరుచి' అనే వంటల కార్యక్రమంతో యాంకర్‌గా మారింది హరితేజ. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి షోలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా దూసుకెళ్లింది.

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీతో లైఫ్ టర్నింగ్

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీతో లైఫ్ టర్నింగ్

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుంది. అంతేకాదు, ఓటింగ్‌లోనూ సత్తా చాటుతూ ఫినాలేకు చేరుకుంది. అయితే, చివర్లో గెలవకపోయినా మూడో స్థానంలో నిలిచిందామె.

  సినిమాల్లో సత్తా.. ఆ పాత్రతో హైలైట్స్

  సినిమాల్లో సత్తా.. ఆ పాత్రతో హైలైట్స్

  బుల్లితెరపై తన హవాను చూపించిన హరితేజ.. వెండితెరపైకి కూడా అడుగులు వేసింది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం.. విజయవంతంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన ఛాలెంజింగ్ పాత్రలను పోషించింది. తద్వారా బడా హీరోల సినిమాల్లో సైతం ఛాన్స్ పట్టేసింది. 'అఆ'లో ఆమె చేసిన మంగమ్మ పాత్ర బెస్ట్ అని చెప్పొచ్చు.

  కరోనా ఉన్నా బిడ్డకు జన్మనిచ్చింది

  కరోనా ఉన్నా బిడ్డకు జన్మనిచ్చింది

  హరితేజ.. దీపక్ అనే వ్యక్తిని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక, ఈ మధ్యనే ఈ జంటకు ఓ పాప పుట్టింది. తన డెలివరీ సమయంలో పడిన కష్టాలను వివరిస్తూ ఇటీవల ఆమె ఎమోషనల్ కూడా అయింది. ఆ సమయంలో తనకు కరోనా సోకిందని.. అప్పుడు తన బిడ్డను డాక్టర్లు చూపించలేదని చెప్పి బాధ పడింది. కానీ, కోలుకున్న తర్వాత బిడ్డతోనే ఎక్కువ సమయం గడుపుతోంది.

  ఎప్పుడూ అందులోనే.. తాజాగా ఇలా

  ఎప్పుడూ అందులోనే.. తాజాగా ఇలా

  హరితేజ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చాలా మంది ఫ్యాన్స్ ఆమె కూతురి గురించి ప్రశ్నలు అడిగారు. అలాగే, హరితేజ కెరీర్‌ గురించి కూడా వాకబు చేశారు. ఈ క్రమంలోనే కొందరు మాత్రం పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆమెను విసిగించేశారు.

  Recommended Video

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  డెలివరీ ఎలా అయింది? పాలు ఎలా

  డెలివరీ ఎలా అయింది? పాలు ఎలా

  ఈ సెషన్‌లో ఓ నెటిజన్ 'పాపకు మీ పాలే ఇస్తున్నారా? బాటిల్‌ పాలా' అని వింత ప్రశ్న అడిగారు. దీనికి హరితేజ 'హహ.. ఏమిటో మీ అనుమానాలు' అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పింది. మరో నెటిజన్ 'మీకు నార్మల్ డెలివరీ అయిందా? ఆపరేషన్ అయిందా' అని అనవసర ప్రశ్న అడిగారు. దీనికి హరితేజ 'మొత్తానికి డెలివరీ అయితే అయిందమ్మా' అంటూ ఓ పంచ్ విసిరింది.

  English summary
  Actress Hari Teja Very Active in Social Media. Recently She Conduct Question and Anwser Session in Instagram. In This Session Question and Anwser Session her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X