»   » ఆస్కార్ అవార్డులకు సాయి కుమార్ సినిమా...

ఆస్కార్ అవార్డులకు సాయి కుమార్ సినిమా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో ఉన్న వారికి ఆస్కార్ అవార్డును మించిన అవార్డు లేదనే చెప్పాలి. ఆ అవార్డు అందకోవడం అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకోవడమే. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు తెలుగు నటుడు సాయి కుమార్ నటించిన కన్నడ సినిమా ఎంపికైంది.

అనూప్ బండారి తొలి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘రంగితరంగ' కన్నడనాట మంచి సక్సెస్ సాధించడంతో పాటు....విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల ఫైనల్ లిస్టుకు ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా 305 చిత్రాలను షార్ట్ లిస్టు చేయగా...అందులో ‘రంగితరంగ' చిత్రం కూడా ఉంది.

Never expected ‘RangiTaranga’ to make it to Oscar race: Anup Bhandari

ఈ చిత్రం వచ్చే నెలలో సాగే అస్కార్ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకోవడం ఖాయం అంటున్నారు. సాయి కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమాకు ఆల్రెడీ అవార్డు వచ్చినట్లే తాను ఫీలవుతున్నట్లు తెలిపారు. తనకు ఆస్కార్ అవార్డు వస్తే తన మనవరాలికి దాన్ని ఇస్తానని తెలిపారు. సాయికుమార్ తనయుడు, హీరో ఆది ఇటీవలే తండ్రి అయిన సంగతి తెలిసిందే.

సినిమా ఆస్కార్ కు ఎంపిక కావడంపై దర్శకుడు అనుప్ భండారి స్పందిస్తూ.....తాను దర్శకత్వం వహించిన చిత్రం ఆస్కార్ అవార్డుల వరకు వెలుతుందని తాను అసలు ఊహించలేదని తెలిపారు.

English summary
Director Anup Bhandari says he never expected Kannada blockbuster “RangiTaranga” to find a spot in the list of over 300 films eligible to be nominated for the 88th Academy Awards.
Please Wait while comments are loading...