దర్శకేంద్రుడికి నచ్చిన కొత్త హీరోయిన్
లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో భాగంగా పరిసరాల పరిశీలన నిమిత్తం ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు కంచికచర్ల విచ్చేశారు. స్థానిక శ్రీ శివసాయి క్షేత్ర పరిసరాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గద్దె ప్రసాద్, పావని దంపతులు, వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు విలేకరులతో మాట్లాడుతూ లకీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించే ఈ చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు) లో విలక్షణ నటుడు మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌కుమార్ హీరోగా నటిస్తారని చెప్పారు.
ఆయనకు జోడీగా తపస్వి అనే నూతన తారను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, సుధ, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తారన్నారు. ప్రముఖ ఛాయాగ్రహకుడు ఎస్ గోపాల్‌రెడ్డి కెమెరామన్‌గా వ్యవహరిస్తారన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి శివసాయి క్షేత్ర ప్రాంగణంలో వారం రోజులపాటు ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్రీకరించే ఈ గీతానికి శివసాయి క్షేత్రం లొకేషన్ చక్కగా సరిపోతుందని, దీంతో ఇక్కడ షూటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ (చిన్ని), మాజీ సర్పంచ్ గద్దె సరస్వతి పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











