twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్స్: కొత్తే కానీ కుమ్మేస్తున్నారు (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమ హీరో పక్కన కొత్త భామ కనిపిస్తేనే అభిమాని సంతృప్తి పడుతుంటాడు. స్టార్ హీరోల చిత్రాలు ఎప్పుడూ కాంబినేషన్ల ప్రకారమే తెరకెక్కుతుంటాయి. స్టార్‌ హీరో + స్టార్‌ హీరోయిన్‌... ఈ లెక్క ప్రకారమే సినిమాల్ని రూపొందిస్తుంటారు. వ్యాపారంలో భాగంగానే ఇలా జరుగుతుంటుంది. దీంతో అగ్రశ్రేణి హీరోయిన్ అనిపించుకోవడానికి కొత్త భామలకు కాసింత సమయం పడుతుంటుంది. వీళ్లు మొదట చిన్న సినిమాలతోనే ఆకర్షించాలి. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరుకోవాలి.

    కొత్త నీరు వస్తే పాత నీరు కనుమరుగై పోతుందంటారు. పాత నీరు పోవడం అటుంచితే... మన చిత్రసీమలో కొత్త నీరు మాత్రం ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. హీరోయిన్స్ విషయాన్నే తీసుకొంటే ఏటా పదుల సంఖ్యలో అందగత్తెలు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అందులో నిలదొక్కుకొనేవాళ్లు తక్కువే అయినా... ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తుంటారు. ఒక్కో ఏడాది ఇద్దరు ముగ్గురు భామలు పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆ తర్వాత మంచి అవకాశాలు పడ్డాయంటే స్టార్‌ హీరోయిన్స్ గా ప్రమోషన్‌ అందుకొంటుంటారు.

    ఏటా ఒకరిద్దరు స్టార్‌ హీరోయిన్స్ కొత్తగా రావడం పరిశ్రమకు చాలా అవసరమంటుంటారు సినీ విశ్లేషకులు. పెరుగుతున్న హీరోల సంఖ్యకి తగ్గట్టుగా హీరోయిన్స్ కూడా తెరపై మెరుపులు మెరిపించాలన్న వాదన వినిపిస్తుంటుంది. పైగా ప్రేక్షకుడికి నచ్చితే హీరోని ఎన్నేళ్త్లెనా చూస్తారు... హీరోయిన్ విషయంలో మాత్రం ఆ సూత్రం చెల్లదంటుంటారు.

    ఆ రకంగా ఇటీవల పరిశ్రమ దృష్టిని తమవైపు మరల్చుకున్న హీరోయిన్స్ సంఖ్య ఒకింత పెరిగిందని చెప్పొచ్చు. వాళ్లంతా తెలుగు చిత్రసీమలో జెండా పాతేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి. అలా అడుగులేసిన ఐదారుగురు భామలు ఇప్పుడు మంచి అవకాశాల ముంగిట ఉన్నారు.

    స్లైడ్ షోలో వారి గురించి తెలుసుకుందాం...

    రెజీనా పవర్ చూపిస్తోంది

    రెజీనా పవర్ చూపిస్తోంది

    'ఎస్‌ఎంఎస్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రెజీనా. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసినా... చెప్పుకోదగ్గ విజయాలేమీ లేవు. కాకపోతే చేసిన ప్రతి చిత్రంతోనూ నటిగా తానేమిటో నిరూపించుకొంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కొత్తజంట' చిత్రంలోనూ చాలా అందంగా కనిపించింది. భావోద్వేగాలు పండించడంలోనూ శభాష్‌ అనిపించుకొంది. దీంతో ఆమెకి ఇప్పుడు క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే రవితేజ సరసన 'పవర్‌'లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. 'రా రా కృష్ణయ్య', 'శంకర', 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర చిత్రాలపైనా ఆశలు పెట్టుకొంది.

    రకుల్‌ ప్రీత్‌సింగ్... పండుగ చేస్కొంటోంది

    రకుల్‌ ప్రీత్‌సింగ్... పండుగ చేస్కొంటోంది

    'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో తొలి విజయం అందుకొంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఆ చిత్రంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టినంతా తనవైపు తిప్పుకొంది. అందంగా కనిపించడంలోనూ, నటన విషయంలోనూ మంచి మార్కులు పడ్డాయి. కథానాయికలో అంతకంటే సుగుణాలు ఇంకేం కావాలి? అందుకే రకుల్‌కి వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఇప్పుడు మంచు మనోజ్‌, గోపీచంద్‌, రామ్‌, ఆది తదితర కథానాయకుల సరసన నటిస్తూ ఎక్స్‌ప్రెస్‌లాగే దూసుకెళుతోంది. 'పండగ చేస్కో' చిత్రంలో రామ్‌తో కలిసి నటించే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకొంది రకుల్‌. అంతకుముందు ఈ సినిమాకోసం హన్సికని ఎంచుకొన్నారు. ఆమెకి కాల్షీట్ల సమస్య తలెత్తడంతో... ఆ స్థానాన్ని రకుల్‌ భర్తీ చేసింది. ఈ మూడు చిత్రాలు మంచి ఫలితాలు సాధిస్తే మాత్రం రకుల్‌ స్థాయి మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

    3

    శాన్వి లవ్‌లీగా...

    శాన్వి లవ్‌లీగా...

    'రౌడీ' సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ కాంపౌండ్‌లోకి అడుగుపెట్టింది శాన్వి. సాధారణంగా వర్మ హీరోయిన్‌ అనగానే అందరూ ప్రత్యేక దృష్టితో చూస్తారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 'రౌడీ'లో శాన్విని చూపించారు వర్మ. ఆమె నడుమొంపులపైనే కెమెరాని తిప్పారు. తెరపై ఎప్పుడూ అమాయకంగా కనిపించే శాన్విలో ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వర్మ శిష్యులు కూడా శాన్వికి అవకాశాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారట. ఇటీవల ఆదితో కలిసి 'ప్యార్‌ మే పడిపోయానే'లో నటించింది.

    పూజా హెగ్డే ..ఒకేసారి రెండు

    పూజా హెగ్డే ..ఒకేసారి రెండు

    పై ముగ్గురు హీరోయిన్స్ తెలుగులో ఒక్కో అడుగు వేస్తూ ఎదిగారు. కానీ కన్నడ కస్తూరి పూజా హెగ్డే మాత్రం అందుకు భిన్నంగా తెలుగులో అవకాశాలు అందుకొంది. 'మాస్క్‌' అనే ఓ అనువాద చిత్రంతో మాత్రమే పూజ ఇదివరకు తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కానీ... అనూహ్యంగా ఆమెకి అవకాశాలు అందాయి. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ చిత్రంలో నటిస్తోంది. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ సరసన కూడా చేస్తోంది. ఈ రెండూ కీలకమైన సినిమాలే. 'మాస్క్‌' తర్వాత తెలుగు పరిశ్రమకు ఎప్పుడూ టచ్‌లో ఉండటంవల్లే పూజా హెగ్డేకి ఈ అవకాశాలు దక్కినట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

    అవికా గోర్

    అవికా గోర్

    చిన్న చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఉయ్యాలా జంపాలా'. ఈ చిత్రం హిట్ హీరోయిన్ అవికా గోర్ కు బాగానే కలిసి వచ్చింది. బెక్కం వేణు గోపాల్ నిర్మిచే చిత్రం ఆమె సైన్ చేసిందని సమాచారం. ఈ చిత్రం ద్వారా మురళీధర్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.అలాగే రచయిత నంధ్యాల రవి దర్శకత్వంలో రూపొందే లక్ష్మీ రావే మా ఇంటికి...చిత్రం ఆమె చేస్తోంది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇలా ఈ రెండు చిత్రాలు కొత్త దర్శకులతోనే కావటం విశేషం.

    ఆదాశర్మ

    ఆదాశర్మ

    పూరీ తాజా చిత్రం హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన కనిపించిన అదా శర్మ గుర్తుండే ఉంటుంది. పూరీ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ సైతం ఆమెను తన సరసన చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రీసెంట్ గా హార్ట్ ఎటాక్ చిత్రం చూసిన ఎన్టీఆర్ ఆమెతో చేయటానికి ఆసక్తి చూపించాడని,ఆమె ఫెరఫార్మెన్స్ ని మెచ్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజైన ఆమె బాలీవుడ్ చిత్రం హసీతో హై పసీ సైతం ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది.

    రాధికా ఆప్టే

    రాధికా ఆప్టే

    ఈ మధ్యనే బాలకృష్ణ సరసన లెజండ్ లో నటించిన ఈ భామకు ఇప్పుడు సీనియర్ హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి. వెంకటేష్, నాగార్జున వంటివారు సైతం ఆమెపై ఆసక్తి చూపిస్తున్నారు.

    అంజలి

    అంజలి

    సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేసిన అంజలి ఆ తర్వాత మళ్లీ బలుపులోనే కనపడింది. ఇప్పుడు ఆమె ఓ హర్రర్ కామెడీలో చేస్తోంది. సీనియర్ హీరోలు ఆమెను తమ సరసన చేయమని అడుగుతున్నా ఆమె ఆసక్తి చూపటం లేదు.

    కృతి సనన్

    కృతి సనన్

    తొలి సినిమా 1 నేనొక్కిడనే పెద్ద కిక్ ఇవ్వకపోవటంతో కృతి సనన్ ప్రతిభ అంతగా బయిటకు రాలేదు. అయినా అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్ గా కృతి పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. తాజాగా రామ్ చరణ్ సరసన కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న చెర్రీ.... ఆ తర్వాత శ్రీనువైట్లతో ఓ మూవీకి కమిటయ్యాడు. అందులోనే హీరోయిన్ గా కృతిని పరిశీలిస్తున్నారని వినపడుతోంది. ఇక ఈ రెండు సినిమాలూ ఓకే అయిపోతే టాలీవుడ్ లో కృతి పేరు మారుమోగిపోవడం ఖాయం

    సమంత, తమన్నా

    సమంత, తమన్నా

    సమంత, అనుష్క, హన్సిక, కాజల్‌, తమన్నా తదితర భామలు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుండటం, యువ హీరోల సరసన నటించడానికి కొత్త భామల అవసరం ఏర్పడటం... వంటి కారణాలతోనే కొత్త హీరోయిన్స్ కి విరివిగా అవకాశాలు దక్కుతున్నాయని తెలుస్తోంది. మరి వీరిలో స్టార్లుగా ఎంతమంది ఎదుగుతారనేది చూడాలి.

    English summary
    It's difficult for a heroine to survive in the industry for long. In Hollywood and to an extent in Bollywood, age doesn't matter, but that's not the case in Telugu cinema; however, it's slowly changing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X