»   » రామ్ చరణ్ ఫామ్ హౌస్ లో కొత్త మెంబర్(ఫొటో)

రామ్ చరణ్ ఫామ్ హౌస్ లో కొత్త మెంబర్(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తన ఫామ్ హౌస్ లోకి కొత్త మెంబర్ వచ్చిందని చెప్తున్నారు. ఆ మెంబర్ మరెవరో కాదు ఇక్కడ మీరు ఫొటోలో చూస్తున్నదే. ఈ విషయమై రామ్ చరణ్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఈ ఫొటో పెట్టి తమా ఫామ్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది.. వెరీ స్పెషల్ అన్నారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్...తాజా చిత్రం విషయానికి వస్తే...

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ..(మార్చి 5) ఉదయం 6 గంటల 24 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది.

దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

New member in Cherry’s farmhouse

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ మా శ్రీను చెప్పినట్టు ఒక అద్భుతమైన కథ ఈ సినిమాకి కుదిరింది. కొంత గాప్ తర్వాత మళ్ళీ మేము ఈ ప్రాజెక్ట్ కోసం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

మేము, శ్రీను వైట్ల - కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ కథలనే నమ్ముతాం. అవే మమ్మల్ని ఈ స్థాయి కి తీసుకొచ్చాయి. ఈ సినిమా మా శ్రీను మార్క్ తో ఉండబోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను." అన్నారు. గోపి మోహన్ మాట్లాడుతూ " మా శ్రీను గారితో మళ్ళీ కలిసి పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ వినాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు." అన్నారు. "శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ లు ఈ సినిమాకి కలిసి పని చెయ్యటం ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతమైన స్రిప్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అన్నారు.

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', నాయిక 'రకుల్ ప్రీత్ సింగ్' ల తో పాటు భారీ తారాగణం , అత్యున్నత సాంకేతిక విలువలతో తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమౌతుంది. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని నిర్మాత చెప్పారు.

English summary
Recently, Ram Charan's farmhouse had a new member and cherry shared this news on his micro-blogging site
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu