For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అర్ధరాత్రి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్: అందుకే వచ్చానంటూ.. అందరి పేర్లు బయటపెట్టారు

  |

  'ఈశ్వర్' అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలో చిన్న చిత్రాల్లోనే నటించిన అతడు.. కొన్నేళ్లుగా భారీ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. ఒకటి పట్టాలపై ఉండగానే మరికొన్ని పాన్ ఇండియా సినిమాను ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. అంతేకాదు, ఎందుకు వచ్చాడో చెబుతూ.. అందరి పేర్లు బయట పెట్టారు. ఆ వివరాలు మీకోసం!

  ఆ రెండు చిత్రాలతో మొత్తం మారిపోయింది

  ఆ రెండు చిత్రాలతో మొత్తం మారిపోయింది

  ‘బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం ‘సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

  Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
  ప్రభాస్ నుంచి రొమాంటిక్‌గా ‘రాధే శ్యామ్'

  ప్రభాస్ నుంచి రొమాంటిక్‌గా ‘రాధే శ్యామ్'

  ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

  ఇది పూర్తవక ముందే మరో మూడు రివీల్

  ఇది పూర్తవక ముందే మరో మూడు రివీల్

  ‘రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్ మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించనున్న ‘ఆదిపురుష్'ను అతడు చేయబోతున్నాడు. అలాగే, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్' అనే సినిమాను కూడా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.

  తొలిసారి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు

  తొలిసారి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు

  ఇక, ‘రాధే శ్యామ్' విషయానికి వస్తే.. ఈ మూవీ 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఇది రూపొందుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే, ఈ సినిమాలో ప్రభాస్ దొంగగా కనిపించబోతున్నాడని అంటున్నారు. వీటితో పాటు ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఉండదని తెలుస్తోంది.

  అర్ధరాత్రి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

  అర్ధరాత్రి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

  ప్రభాస్ సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తున్నా.. ఆయన అభిమానులు మాత్రం నిరాశగానే ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం ‘రాధే శ్యామ్' నుంచి సరైన అప్‌డేట్లు రాకపోవడమే. ఈ విషయంపై నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌తో గొడవలకు కూడా దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి ‘రాధే శ్యామ్' నుంచి ఓ పోస్టర్ వదిలింది చిత్ర యూనిట్.

  అందుకే వచ్చానంటూ.. అందరి పేర్లు లీక్

  అందుకే వచ్చానంటూ.. అందరి పేర్లు లీక్

  ట్రావెల్ బ్యాగ్‌తో క్యాప్ పెట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్‌ను ‘రాధే శ్యామ్' యూనిట్ విడుదల చేసింది. అంతేకాదు, ‘మీ హృదయాలను గెలుచుకోడానికి వచ్చేశాడు.. మీరు మరోసారి అతడి ప్రేమలో పడడం ఖాయం. నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని అందులో రాసుకొచ్చారు. అలాగే, ఈ సినిమాలో నటించే వారి వివరాలతో పాటు టెక్నీషియన్లు సమాచారాన్ని వెల్లడించడం విశేషం.

  English summary
  Radhe Shyam is an upcoming Indian romantic drama film written and directed by Radha Krishna Kumar with Prabhas and Pooja Hegde in the lead roles. Shot simultaneously in Telugu and Hindi, the film is presented by Krishnam Raju under Gopi Krishna Movies in Telugu with Bhushan Kumar under T-Series in Hindi and produced by UV Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X