Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హిస్టరీలో వినపడుతుంది: ( బాలకృష్ణ 'లయన్' టీజర్)
హైదరాబాద్: ' కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ పవర్ ఫుల్ గా వచ్చేసారు. నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న చిత్రానికి 'లయన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ ని వదిలారు.
సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. ఆ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్సకుడు మాట్లాడుతూ... ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా.

అలాగే... ''లెజెండ్'తో బాలకృష్ణ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''చిత్రంలో బాలకృష్ణ నాయకుడిగా, బాధ్యతగల అధికారిగా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్