»   » నవదీప్‌ ఇష్యూ: బ్రహ్మాజీ సపోర్టు (ఫాంహౌస్ పార్టీ ఫోటోస్)

నవదీప్‌ ఇష్యూ: బ్రహ్మాజీ సపోర్టు (ఫాంహౌస్ పార్టీ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నవదీప్ తన ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించాడని, సినీ రంగంలోని తన స్నేహితులతో కలిసి మందు... విందుతో రచ్చరచ్చ చేసాడని మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఫాంహౌస్ లో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఫోటోలు బయటకు రావడంతో ఈ ఇష్యూ మరింత బలపడింది.

అయితే ఈ వార్తలతో షాకైన నవదీప్... ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. తనకు అసలు ఫాంహౌస్ లేదు. మా అమ్మతో కలిసి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి డిన్నర్ కి వెళ్లాం. ఫ్యామిలీ ఫంక్షన్ ను రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారంటూ మీడియాపై మండి పడ్డారు.

ఈ సంఘటనపై తాజాగా నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించారు. నవదీప్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవి అని స్పష్టం చేసారు. నిన్న రాత్రి ఆ పార్టీలో తాను కూడా ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు బ్రహ్మాజీ తెలిపారు. పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చేసుకున్న ఫాంహౌస్ పార్టీగా బ్రహ్మాజీ పేర్కొన్నారు.

స్లైడ్ షోలో బ్రహ్మాజీ ట్వీట్, నవదీప్ రిలీజ్ చేసిన ఫాంహౌస్ పార్టీ ఫోటోస్...

నవదీప్‌ ఇష్యూ: బ్రహ్మాజీ సపోర్టు (ఫాంహౌస్ పార్టీ ఫోటోస్)

బ్రహ్మాజీ ట్వీట్

నవదీప్ రిలీజ్ చేసిన ఫోటో

నవదీప్ రిలీజ్ చేసిన ఫోటో


అక్కడ రేవ్ పార్టీ జరుగలేదని, జరిగింది ఇదే అంటూ నవదీప్ రిలీజ్ చేసిన ఫోటోస్...

ఫ్యామిలీ ఈవెంటు

ఫ్యామిలీ ఈవెంటు


నవదీప్ రిలీజ్ చేసిన ఫోటోస్ చూస్తే ఇది ఫ్యామిలీ ఈవెంటులా ఉంది.

పిల్లలు, పెద్దలు

పిల్లలు, పెద్దలు


నవదీప్ రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి పిల్లలు, పెద్దలు కలిసి చేసుకున్న ఫంక్షన్ లా ఉంది.

పోలీసులు ఎందుకు దాడి?

పోలీసులు ఎందుకు దాడి?


అయితే ఈ వేడుకపై పోలీసులు ఎందుకు దాడి చేసారనేది అంతుపట్టడం లేదు.

ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారా?

ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారా?


పోలీసులకు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారా? లేక మరేదైనా ఉందా? అనేది తేలాల్సి ఉంది.

English summary
"News about pnavdeep26 is utterly baseless.I was there with my family too..it's farm house party with kids n families." Actor Brahmaji tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X