»   » నేను సెట్టయినట్లే.... ‘నెక్ట్స్ నువ్వే’ వేడుకలో విజయ్ దేవరకొండ

నేను సెట్టయినట్లే.... ‘నెక్ట్స్ నువ్వే’ వేడుకలో విజయ్ దేవరకొండ

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్‌, యు.వి.క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌..... ఈ మూడు సంస్థలు కలిసి వి4 క్రియేషన్స్‌ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలతిసిందే. ఈ బేనర్లో తెరకెక్కిన తొలి చిత్రం 'నెక్స్‌ట్‌ నువ్వే'. హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది హీరోగా నటించగా, వైభవి శాండిల్య, రష్మీ హీరోయిన్లుగా చేశారు. ఈటీవీ ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి సాయికార్తీక సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆడియో విడుదల శనివారం గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు బోయపాటి, 'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై సీడీలను విడుదల చేశారు.


బోయపాటి శ్రీను మాట్లాడుతూ

బోయపాటి శ్రీను మాట్లాడుతూ

తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్షయపాత్రలాంటిది. ఎవరొచ్చినా ఎంకరేజ్‌ చేసే పరిశ్రమ. అల్లు అరవింద్‌గారు, జ్ఞానవేల్‌ రాజా, బన్నివాసు, వంశీగారు కలిసి కొత్త సినిమాలను ఎంకరేజ్‌ చేయాలనే ఈ బ్యానర్‌ను పెట్టారు. సినిమా చాలా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


 నేను సెట్‌ అయిపోయినట్లే అంటున్న విజయ్ దేవరకొండ

నేను సెట్‌ అయిపోయినట్లే అంటున్న విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ - ''నేను ఇంకా స్ట్రగులింగ్‌ యాక్టర్‌లానే ఫీలవుతాను. నాలాంటి నటుడికి గీతాఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌లో రెండు వరుస సినిమాలు అంటే..నేను సెట్‌ అయిపోయినట్లే. ఇక వి4 బేనర్‌ అనౌన్స్‌ చేయగానే కొత్త దర్శకులు,కొత్త కాన్సెప్ట్‌లకు మంచి రోజులువచ్చాయి. ఒక మంచి కాన్సెప్ట్‌ పట్టుకుని వీళ్ల దగ్గరకు వెళితే వీళ్లు సినిమా చేస్తారనే నమ్మకం అయితే ఉండేది. వి4 బేనర్‌లో వస్తోన్న నెక్స్‌ట్‌ నువ్వే సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. కొత్త దర్శకులు, కాన్సెప్ట్‌లకు ఓ ల్యాబ్‌, ఓ గ్రౌండ్‌లా ఉంటుందని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.


 హీరో ఆది మాట్లాడుతూ

హీరో ఆది మాట్లాడుతూ

నలుగురు పెద్ద నిర్మాతలు కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అరవింద్‌గారు, బన్నివాసుగారు, వంశీగారు, జ్ఞానవేల్‌రాజాగారికి థాంక్స్‌. ప్రభాకర్‌గారు ఫస్ట్‌ సినిమా అయినా ఓ ఎక్స్‌పీరియెన్స్‌ ఉన్న డైరెక్టర్‌లా సినిమాను డైరెక్ట్‌ చేశాడు. సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ

''తమిళంలో కాన్సెప్ట్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగు కాన్సెప్ట్‌ సినిమాలను ఆదరించడానికి జనం, ఈ యంగ్‌ జనరేషన్‌ ఆసక్తిని చూపిస్తున్నా పెద్దగా రావడం లేదని ఓ సారి బన్ని వాసు నేను చర్చించుకున్నాం. తెలుగులో కాన్సెప్ట్‌ సినిమాలను ఎంకరేజ్‌ చేయడానికే వి4 సంస్థ వచ్చింది. ఎవరికైనా మమ్మల్ని ఎలా సంప్రదించాలనే సందేహం రావచ్చు. ఈ సినిమా విడుదలయ్యేలోపు కొత్త కాన్సెప్ట్‌ సినిమాలున్నవారు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో చెబుతాను. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సినిమాకు వర్క్‌ చేసిన సాంకేతిక నిపుణులకు ఆల్‌ది బెస్ట్‌'' అన్నారు.


చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ

చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ

''అదృష్టవశాత్తు నాకు ఈ సినిమా డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను. సినిమా బాగా వచ్చింది. ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. నెక్స్‌ట్‌నువ్వే టైటిల్‌ క్రెడిట్‌ మాత్రం పరుశురాంగారిదే. ఆది లాంటి హీరో దొరకడం అదృష్టం. తను ఒప్పుకున్న తర్వాతే సినిమాకు ఎలివేషన్‌ వచ్చింది. ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్‌ చేశారు అన్నారు.


నటీనటులు, తెర వెనక

నటీనటులు, తెర వెనక

ఈ చిత్రంలో ఆది, వైభవి శాండిల్య, రష్మీ, అవసరాల శ్రీనివాస్‌, హిమజ, జయప్రకాష్‌రెడ్డి, ప థ్వీ, ఎల్‌.బి.శ్రీరామ్‌, పోసాని, రఘు కారుమంచి, బెనర్జీ, తాగుబోతు రమేష్‌, ముమైత్‌ఖాన్‌, షకీలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: డి.కె., మాటలు: శ్రీకాంత్‌ విస్సా, నిరుపమ్‌ పరిటాల, సంగీతం: సాయికార్తీక్‌, పాటలు: కె.కె, సాగర్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పళని, ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్దవ్‌, ఆర్ట్‌: శ్రీకాంత్‌, సహనిర్మాత: ఎస్‌.కె.ఎన్‌., నిర్మాత: బన్ని వాస్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకర్‌.


English summary
Next Nuvve Movie Audio Launch event held at Hyderabad. Aadi, Saikumar, Rashmi Gautam, Vaibhavi Shandilya, Himaja, Prabhakar, Sai Karthik, Bunny Vas, Vamsi Krishna Reddy, Vijay Devarakonda, Allu Aravind, KE Gnanavel Raja, Boyapati Srinu, Brahmaji, Srinivas Avasarala, Maruthi, Ram Jegan, Parasuram, Writer Srikanth, Nirupam, Anchor Shyamala, Banerjee at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu