»   » ‘నెక్ట్స్ నువ్వే’ ట్రైలర్ సూపర్: ఆది హీరో, రష్మి హాట్ హాట్‌గా...

‘నెక్ట్స్ నువ్వే’ ట్రైలర్ సూపర్: ఆది హీరో, రష్మి హాట్ హాట్‌గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Next Nuvve Movie Theatrical Trailer నెక్ట్స్ నువ్వే హాట్ హాట్ ట్రైల‌ర్!

ఆది హీరోగా వి4 మూవీస్ బ్యానర్‌లో పి.ప్రభాకర్‌(ఈటీవీ ప్రభాకర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'నెక్ట్స్ నువ్వే'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ హిలేరియస్ కామెడీ థ్రిల్లర్‌.... ట్రైలర్ సోమవారం రిలీజ్ చేశారు.

ఆది సరసన వైభవి, రష్మీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

హీరో క్యారెక్టర్

హీరో క్యారెక్టర్

సినిమాలో హీరో ఆది క్యారెక్టర్ అంత గొప్పగా ఏమీ ఉండదని... అప్పులతో కొట్టుమిట్టాడుతుంటాడని తెలుస్తోంది.

కీలకమైన పాత్రలో పృథ్వి

కీలకమైన పాత్రలో పృథ్వి

కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమెడియన్ పథ్వి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో అతడు సీరియల్ యాక్టర్‌గా కనిపించనున్నాడు.

హీరోయిన్ వైభవి

హీరోయిన్ వైభవి

ఈ చిత్రంలో మొదటి హీరోయిన్‌గా వైభవి నటిస్తోంది. సినిమాలో... ఆమెది ఓ సీరియల్ హీరోయిన్ పాత్ర. స్టార్ హీరోయిన్ అవ్వాలని కలలుకనే ఆమె సీరియల్ హీరోయిన్ దగ్గరే మిగిలిపోయాననే ప్రస్టేషన్లో హీరోను వేపుకుతింటూ ఉండే పాత్రలో కనిపించబోతోంది.

రష్మి హాట్ హాట్

రష్మి హాట్ హాట్

అటు యాంకర్‌గా, ఇటు హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మి ఈ చిత్రంలో హాట్ హాట్ గా కనిపించబోతోంది. ఇందులో ఆమె ఆది సరసన సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. లుక్ స్పైసీ, కోరికలు క్రేజీ, పటాయించడం చాలా ఈజీ... తరహాలో ఆమె పాత్ర ఉండబోతోంది. ‘నీకు గడ్డివాము దగ్గర కుక్కగురించి తెలుసా? అది తినదు, ఇంకొకరిని తిన నివ్వదు అంటూ మొదటి హీరోయిన్ మీద ఈర్ష్య పడుతూ హీరో మీద్ క్రష్ తో ఉండే పాత్రలో రష్మి కనిపించబోతోంది.

బ్రహ్మాజీ.... ఈ మూత్రధారుడు. కథలో సూత్రధారుడు

బ్రహ్మాజీ.... ఈ మూత్రధారుడు. కథలో సూత్రధారుడు

నటుడు బ్రహ్మాజీ ఈ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మూత్రం పోస్తు ముగ్గులేసే పాత్రలో అతన్ని ట్రైలర్లో పరిచయం చేశారు. ఈ మూత్రధారుడు, కథలో సూత్రధారుడు అంటూ అతన్ని పరిచయం చేశారు. సినిమా హీరో, సెలబ్రిటీ పాత్రలో బ్రహ్మాజీ కనిపించనున్నారు.

షకీల కూడా...

షకీల కూడా...

ఈ చిత్రంలో ఒకప్పటి శృంగార నటి షకిల కూడా కీలకమైన పాత్రలో కనిపించనుంది. అయితే ఆమె పాత్ర సినిమాలో అంత ముఖ్యమైనది ఏమీ కాదని తెలుస్తోంది.

కథేంటి?

కథేంటి?

సినిమాలోని ముఖ్య పాత్రధారులు అంతా కలిసి ఓ హోటల్‌ పడతారు. ఆ హోటల్‌కి వచ్చిన వారంతా అక్కడే మరణిస్తుంటారు. వారంతా ఎలా చనిపోతున్నారో తెలియక అంతా తికమక పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కథ కామెడీ, థిల్లర్‌గా ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఉంటుంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఆది, వైభవి, రష్మీ, అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, రఘు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ట్రైలర్

ఈటీవీ ప్రభాకర్‌‌గా పాపులర్ అయిన నటుడు ప్రభాకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాయికార్తీక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వీ4 మూవీస్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు.

English summary
Next Nuvve Theatrical Trailer released. Starring Aadi, Vaibhavi, Rashmi, Brahmaji. Making his direction Debut #Prabhakar, Music by Sai Kartheek , Produced by Bunny Vas , From the banner V4 Movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu