»   »  బ్యాడ్ కామెంట్స్ మీద భగ్గుమన్న నిహారిక!

బ్యాడ్ కామెంట్స్ మీద భగ్గుమన్న నిహారిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక త్వరలో 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న తొలి ఆడపడుచు. ఇటీవల నిహారిక తన ఫ్రెండ్స్ తో కలిసి బాబాయ్ మూవీ 'సర్దార్ గబ్బర్ సింగ్' చూసింది. వారికి సినిమా బాగా నచ్చింది.

అయితే సినిమాకు విడుదలైన తొలిరోజు నుండే మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఎరి అభిప్రాయం వారు చెబుతున్నారు. సినిమా నచ్చిన అభిమానులు పాజిటివ్ గా, నచ్చని వారు కొందరు సినిమా గురించి నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారు. అయితే నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై నిహారిక మండి పడిందట. సినిమా బాబుంది... కావాలనే బాబాయ్ సినిమాపై బ్యాండ్ కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడుతోందట.

అయితే నిహారిక తీరు చూసిన కొందరు ఆమె నేర్చుకోవాల్సింది చాలా ఉందని అంటున్నారు. నిహారిక సినిమా రంగానికి కొత్త....మున్ముందు ఇలాంటి అనుభవాలు చాలా ఎదురువతాయి. సహనంగా ఉండటం నేర్చుకోవాలి అంటున్నారు.

నిహారిక నటిస్తున్న 'ఒక మనసు' మూవీ వివరాల్లోకి వెళితే రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. మరో వైపు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ తో యాక్టింగ్ టాలెంట్ పరంగా తానేంటో నిరూపించుకుంది. వెబ్ సిరీస్ లో అదరగొట్టిన నిహారిక సినిమాలో మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

స్లైడ్ షోలో నిహారిక 'ఒక మనసు' చిత్రానికి సంబంధించిన ఫోటోస్..

నిహారిక

నిహారిక


హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

నిర్మాతలు

నిర్మాతలు


మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వైజాగ్

వైజాగ్


ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది.

సంగీతం

సంగీతం


ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
Niharika fired about Sardar Gabbar Singh negetiv talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu