ట్రైలర్ టాక్ : నీహారిక కొణిదల‘ఒక మనసు’ (వీడియో)
హైదరాబాద్: నాగశౌర్య, నాగబాబు కుమార్తె నిహారిక జంటగా నటిస్తున్న చిత్రం 'ఒక మనసు'.రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సునీల్ కస్యప్ స్వరాలు సమకూర్చారు. ఈ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగింది. ఈ సినిమా కథలో పొలిటికల్ టచ్ తో కూడా ఉన్నట్లు అర్దమవుతుంది. పాత్రల మధ్య ప్రేమ, కుటుంబ అనుబంధాలు వీటికి దర్శకుడు ప్రయారిటి ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ మద్య వచ్చే కాన్వర్షేషన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమానికి నాగబాబు, వరుణ్‌తేజ్, సాయి ధరమ్ తేజ, నిహారిక, నాగశౌర్య, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, తదితరులు హాజరయ్యారు. రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముద్దపప్పు అవకాయ అనే యూట్యూబ్ సిరీస్‌లో నటించిన మెగా వారసురాలు నిహారిక హీరోయిన్ గా చేస్తున్న తొలి చిత్రమిది.


Click it and Unblock the Notifications











