»   » నిహారిక కోసం వస్తున్నా...నాగబాబు వద్దంటున్నాడట!

నిహారిక కోసం వస్తున్నా...నాగబాబు వద్దంటున్నాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న తొలి హీరోయిన్ నిహారిక. త్వరలో ఆమె 'ఒక మనసు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెగా అభిమానుల సపోర్టు కూడా ఉండటంతో నిహారికతో సినిమా చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చే అంచనాకు వచ్చారు చాలా మంది నిర్మాతలు.

ఇటీవల కొందరు నిర్మాతలు నాగబాబును సంప్రదించి నిహారిక డేట్స్ భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి దక్కించుకునేందుకు ప్రతిపాదించారట. అయితే నాగబాబు ఇప్పుడే అలాంటివేమీ వద్దని, 'ఒక మనసు' సినిమా విడుదలైన తర్వాత నిహారిక తర్వాతి సినిమాల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసారట. అంటే 'ఒక మనసు' సినిమాకు వచ్చే రెస్పాన్స్ బట్టే నిహారిక సినిమాల్లో కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది ఆధారపడి ఉంటుందన్నమాట.

Niharika decide after 'Oka Manasu' release

ఈ చిత్రం హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

నిహారిక నటన పరంగా ఫర్వాలేదని ఇప్పటికే 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ ద్వారా నిరూపించుకుంది. ఇందులో ఆమె కాస్త అల్లరి పిల్లలా కనిపించినా.... ఈ సినిమాలో మాత్రం చాలా డీసెంట్ రోల్ చేస్తోంది.

English summary
Many producers are said to be ready to buy Niharika's dates with huge remuneration, currently Nagababu is not giving anyone a chance. He's waiting for "Oka Manasu" release date such that he could take the feedback and decided on Niharika's next films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu