»   »  నిహారిక కామెంట్స్: చిరు, పవన్ ఇతర మెగా హీరోలపై...

నిహారిక కామెంట్స్: చిరు, పవన్ ఇతర మెగా హీరోలపై...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కొణిదెల నిహారిక. మధుర శ్రీధర్‌ నిర్మించ బోయే ఓ ప్రేమ కథా చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి ‘ఒక మనసు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మిణుగురులు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ దర్శకత్వంలో ఆమె రెండో సినిమా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల ఓ టీవీ షోలో నిహారిక పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్నతనంలో తాను డాక్టర్ కావాలనుకున్నానని, కానీ ఇపుడు యాక్టర్ అవుతుండటం చూసి ఒక్కోసారి నాలో నాకే ఆశ్చర్య అనిపిస్తుందని నిహారిక చెప్పుకొచ్చారు. ఇంట్లో తనను అంతా ముద్దుగా ‘నిహా' అంటారని చెప్పుకొచ్చింది. చిరంజీవిని డాడా అని, నాగ బాబును నాన్న అని పిలుస్తానని చెప్పింది.

 Niharika interesting comments on Mega Family stars

చిరంజీవి గురించి మాట్లాడుతూ..‘మా మెగా కుటుంబానికి ఆద్యుడు డాడీ చిరంజీవి, మేమంతా ఇలా ఉన్నామంటే కారణం మా చిరు డాడీ నే. అలాగే ఇంత పెద్ద చేసిన ఇండస్ట్రీకి ఆయన వల్లే మా కుటుంబం నుండి ఇంతమంది హీరోలు వచ్చారని, మాకు మంచి జీవితాలను ఇచ్చారు' అంటూ నిహారిక పొగడ్తలు గుప్పించింది.

తండ్రి నాగ బాబు గురించి మాట్లాడుతూ....తనకు అన్నీ తానే అని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే మాత్రం... బాబాయ్ అంటే చాలా భయం అని చెప్పేసింది. బాబాయ్ అంటే ఎందుకు అంత భయం అనే విషయం మాత్రం నిహారిక బయట పెట్టక పోవడం గమనార్హం.

యంగ్ మెగా హీరోలకు నిహారిక మాట్లాడుతూ.... అన్నయ్య వరుణ్ తేజ్-తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే బ్రదర్ అని, రామ్ చరణ్ - మై గాడ్....అల్లు అర్జున్ - ఎనర్జిటిక్ అండ్ ఫన్... సాయి ధరమ్ తేజ్-ఫుల్లీ యాక్టివ్...అల్లు శిరీష్-నన్ను ఎప్పుడూ ఏడిస్తాడని అని చెప్పుకొచ్చింది.

English summary
Niharika interesting comments on Mega Family stars.
Please Wait while comments are loading...