»   » చిరు, పవన్‌తో సహా మెగా ఫ్యామిలీలోని అందరిపై.... నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

చిరు, పవన్‌తో సహా మెగా ఫ్యామిలీలోని అందరిపై.... నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసి తన క్యూట్ యాటిట్యూడ్‌‌తో పాటు ఆకట్టుకునే నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కొణిదెల నిహారిక. వెల్ సెటిల్డ్ సినిమా ఫ్యామిలీలో జన్మించడం ఆమె చేసుకున్న అదృష్టమని ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు. అయితే ఎంత అదృష్టం ఉన్నా సినిమాల్లో రాణించాలంటే సొంత టాలెంట్ కూడా అవసరం... దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఈ మెగా డాటర్ తమ కుటుంబంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మంచి విషయం నేర్చుకున్నట్లు తెలిపారు. చిరు, పవన్, నాగబాబు, చెర్రీ, బన్నీ అందరి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  చిరంజీవి దగ్గర నుండి...

  చిరంజీవి దగ్గర నుండి...

  డాడీ చిరంజీవి దగ్గర నుండి కష్టపడే తత్వాన్నీ నేర్చుకున్నాను. సక్సెస్, హోదా అనేది ఒక్కరాత్రిలో రాదు... దాని వెనక ఎన్నోఏళ్ల కృషి దాగి ఉంటుంది అని ఆయన్ను చూసి నేర్చుకున్నాను అని నిహారిక చెప్పుకొచ్చారు.

  Niharika Sensational Comments on Chiranjeevi, Pawan Kalyan
   నాన్న నాగబాబు నుండి

  నాన్న నాగబాబు నుండి

  నాన్న దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా ఎన్ని బాధలు ఉన్న ఒక్క నవ్వుతో ప్రాబ్లమ్స్ అన్నింటి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నేను కూడా దాన్ని అలవాటు చేసుకుంటున్నాను అని నిహారిక తెలిపారు.

  పవన్ కళ్యాణ్ బాబాయ్ నుండి

  పవన్ కళ్యాణ్ బాబాయ్ నుండి

  పవన్ క ళ్యాణ్ బాబాయ్ చుట్టూ ఉండే సౌరభం(aura) అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి మూమెంటులో అది ఉంటుంది. అదంటే నాకు చాలా ఇష్టం. అవకాశం ఉంటే దాని(aura) నుండి ఓ ముక్క కట్ చేసి నేను పెట్టుకోవాలని ఉంటుంది. దాన్ని ఎలా ఎక్స్‌ప్లేన్ చేయాలో తెలియడం లేదు. ఆయన నుండి దాన్ని నేర్చుకోవడం కాదు కొట్టేయాలని ఉంది అని నిహారిక వ్యాఖ్యానించారు.

  రామ్ చరన్ అన్నయ్య గురించి

  రామ్ చరన్ అన్నయ్య గురించి

  రామ్ చరణ్ అన్నయ్య నుండి ‘ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్' అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్యామిలీ పట్ల ఆయన చాలా కేరింగ్‌గా ఉంటారు అని నిహారిక తెలిపారు.

  వరుణ్ అన్న నుండి

  వరుణ్ అన్న నుండి

  కోపం ఎక్కడ చూపించాలో తెలియాలి... అనే విషయాన్ని వరుణ్ అన్నయ్య నుండి నేర్చుకున్నాను అని నిహారిక తెలిపారు.

  సాయి ధరమ్ తేజ్

  సాయి ధరమ్ తేజ్

  ‘మన ఫ్యామిలీలో మనకంటే చిన్న వారి విషయంలో ఎలా కేర్ తీసుకోవాలి అనేది' సాయి ధరమ్ తేజ్ నుండి నేర్చుకున్నాను. తేజ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని నిహారిక తెలిపారు.

  బన్నీ నుండి...

  బన్నీ నుండి...

  బన్నీ అన్నకు, చిరంజీవి డాడీకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన సినిమాల పట్ల చాలా పాషన్ గా ఉంటారు. ప్రతి సినిమాకు కొత్తదనం ట్రైచేస్తూ ఉంటారు. ఆయన పెట్టే ఎపర్ట్ చాలా నచ్చుతుంది.... దీన్ని ఆయన నుండి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని నిహారిక తెలిపారు.

  అల్లు శిరీష్ నుండి...

  అల్లు శిరీష్ నుండి...

  ‘శిరీష్ అభిమానులతో ఎక్కువ కాంటాక్టులో ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నా వద్ద అలాంటి టాలెంట్ లేదు.... తీసుకోవాల్స వస్తే శిరీష్ నుండి ఇలాంటి విషయాలు తీసుకుంటాను అని నిహారిక తెలిపారు.

  ఉపాసన గురించి

  ఉపాసన గురించి

  ఉప్సి అక్క వండర్‌ఫుల్ బాస్. తనకు కావాల్సిన పని ఎలా చేయించుకోవాలో బాగా తెలుసిన వ్యక్తి. తాను ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. ప్రతి విషయంలో చాలా పాజిటివ్ గా ఉంటారు. ఇది సాధ్యం కాదు, ఇది మన వల్ల కాదేమో? అనేది ఆమెలో ఎప్పుడు చూడలేదు... అని నిహారిక తెలిపారు.

  స్నేహ గురించి...

  స్నేహ గురించి...

  ‘స్నేహ అక్క పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అయాన్, అర్హలను చాలా బాగా చూసుకుంటారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరితో వెంటనే మింగిల్ అయిపోతారు' అని నిహారిక తెలిపారు.

  అల్లు అరవింద్ మామ గురించి

  అల్లు అరవింద్ మామ గురించి

  అంత పెద్ద నిర్మాత అయుండి అంత ప్రెషర్ ఉన్నా కూడా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ పూర్తిగా వేరు వేరు చేసి డీల్ చేస్తారు. రెండింటిని ఎప్పుడూ మిక్స్ చేయరు. వర్క్ విషయంలో ఎంత ప్రెజర్ ఉన్నా పర్సనల్ లైఫ్‌లో దాన్ని కనిపించనివ్వరు అని... నిహారిక తెలిపారు.

  మా ఫ్యామిలీతో సినిమాలు చేయాల్సి వస్తే

  మా ఫ్యామిలీతో సినిమాలు చేయాల్సి వస్తే

  ‘మా ఫ్యామిలీ వారితో సినిమాలు చేస్తే ‘పుట్టింటికి రా చెల్లి' లాంటి సినిమాలు చేయాలి. సిస్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్ లాంటి చిత్రాలు మాత్రమే చేయగలం.... అని నిహారిక వ్యాఖ్యానించారు.

  English summary
  Niharika Konidela interesting comments about Mega Family members. Niharika Konidela is the sweetest daughter of the Megastar Chiranjeevi’s brother Konidela Nagendrababu and Padmaja Konidela. Her debut film is Oka Manasu. She is the first lady to enter the silver screen from the Megastar’s family. Niharika shared many things about her career and personal things in Beauty & Beast talk show.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more