»   » నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!

నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక ప్రధాన పాత్రలో 'ముద్ద పప్పు ఆవకాయ్' అనే వెబ్ సీరీస్ యూట్యూబులో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో 'ముద్ద పప్పు ఆవకాయ్' తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటికే 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ స్తోంది. ఒక్కో ఎపిసోడ్ 1 మిలియన్ పైగా వ్యూస్ రావడం విశేషం.

Also Read: అందం ఇందోళం..!(నాగబాబు కూతురు నిహారిక ఫోటో షూట్)

ఇక తాజాగా ముద్దపప్పు ఆవకాయ్ 4వ ఎపిసోడ్ కూడా రిలీజైంది. గత మూడు ఎపిసోడ్ల కంటే 4 ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్లో తాను ప్రేమించిన వ్యక్తిని ఏకంగా కిడ్నాప్ చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది నిహారిక. ఇందులో నిహారిక పెర్ఫార్మెస్ సూపర్బ్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: షూటింగ్ స్పాట్లో... నాగ శౌర్య-నిహారిక కొణిదెల (ఫోటో)

ముఖ్యంగా నిహారిక ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. సందర్భానికి తగిన విధంగా ఆమె డైలాగ్ డెలివరీ తీరు, నటన ఉండటంతో నిహారికకు విమర్శకుల నుండి సైతం మంచి మార్కులు పడుతున్నాయి. ఈ తరం యూత్ ఆటిట్యూడ్ ప్రతిభించే విధందా ఈ వెబ్ సీరస్ ఉండటంతో మంచి ఆదరణ లభిస్తోంది.

ప్రతి ఎపిసోడ్ ఎండింగ్... మరో ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అసక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది. వెంట వెంటనే ఎపిసోడ్స్ రిలీజ్ చేయండి, ఉత్కంఠ తట్టుకోలేక పోతున్నాం అంటూ కొందరు వ్యూవర్స్ చేస్తున్న కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. నెక్ట్స్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం లేటయితే మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తాం అంటూ..మరికొందరు కామెంట్ చేస్తున్నారంటే ఈ వెబ్ సిరీస్ మీద క్రేజ్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోసుకోకుండా వెయింటింగ్

పోసుకోకుండా వెయింటింగ్


ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ మీద జనాల్లో ఏ రేంజిలో క్రేజ్ ఉందో ఈ కామెంట్ చూస్తే అర్థమవుతుంది.

కేసు వేస్తాం..

కేసు వేస్తాం..


ఎపిసోడ్ రిలీజ్ చేయడం ఆలస్యం అయితే కేసు వేస్తాం అంటూ మరో కామెంట్

సాగదీయొద్దు..

సాగదీయొద్దు..


ముద్దపప్పు ఆవకాయ్ ని సిరీయల్ లా సాగదీయొద్దని పలువురు ఫ్యాన్స్ కోరుతున్నారు.

ట్విస్టులు బావున్నాయి

ట్విస్టులు బావున్నాయి


ఎపిసోడ్ ఎపిసోడ్ కి ట్విస్టులు బావున్నాయంటూ ప్రశంసలు వస్తున్నాయి.

చచ్చిపోతున్నాం ఇక్కడ...

చచ్చిపోతున్నాం ఇక్కడ...


సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం....జనాలు డైయింగ్ ఇక్కడ త్వరగా మరో ఎపిసోడ్ రిలీజ్ చేయండంటూ కామెంట్.

సీరియల్స్ నచ్చవు కానీ...

సీరియల్స్ నచ్చవు కానీ...


సీరియల్స్ నచ్చవు కానీ ముద్దపప్పు ఆవకాయ్ నచ్చింది అంటూ మరో కామెంట్

నిహారికపై ప్రశంసలు

నిహారికపై ప్రశంసలు


నిహారిక పెర్ఫార్మెన్స్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

rn

ఎపిసోడ్ 4

తాజాగా విడుదలైన ఎపిసోడ్ 4 చాలా ఆసక్తిరంగా ఉంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Watch Episode - 04 of Muddapappu Avakai - The first ever telugu Web Series Starring Niharika Konidela, Pratap, and the Series is directed by Pranith. Bramandapally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu