»   »  నాగ బాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ, మూవీ డీటేల్స్..

నాగ బాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ, మూవీ డీటేల్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారికా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందనే విషయమై గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుర శ్రీధర్‌ నిర్మించే సినిమా ద్వారా నిహారిక ఎంట్రీ ఇస్తోందట.

‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. నాగశౌర్య కథానాయకుడు. మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘రామరాజు చక్కని కథ, కథనాలతో కొత్తదైన ప్రేమకథ చెప్పారు. ఎటువంటి వల్గారిటీ లేకుండా స్వచ్చమైన ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది.

 Niharika Konidela all set to test her waters as heroine

మెగా ఫ్యామిలీ వారసురాలైన నిహారికను మా బ్యానర్‌ ద్వారా హీరోయిన్‌గా లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ నెలాఖరులో షూటింగ్‌ మొదలుపెడతాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి ఎ.అభినయ్‌, డా.కృష్ణ భట్ట సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి కేవలం హీరోలు మాత్రమే వచ్చారు. తొలిసారి మెగా స్టార్ వారసత్వం పునికి పెచ్చుకుని హీరోయిన్ వస్తుండటంతో సర్వత్రా హాట్ టాపిక్ అయింది.

English summary
While Naga Babu's daughter Niharika Konidela was the first girl from the popular film family to step into showbiz, she will now make her big screen debut in a film with Mallela Teeramlo Sirimalle Puvvu director Rama Raju.
Please Wait while comments are loading...