»   » కొణిదెల నిహారిక తల్లి పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

కొణిదెల నిహారిక తల్లి పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిహారిక తొలి సినిమాకు.....మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది.

Niharika Mother Is Ramya Krishna

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు హీరోగా పరిచయం అవుతున్నారంటే... వారిని పరిచయం చేయడానికి భారీ ఈవెంట్స్ నిర్వహించడం ఆనవాయితీ.

మెగా ఫ్యామిలీ హీరోల లాంచింగ్ సమయంలో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి. తాజాగా నిహారిక ను అందరికీ పరిచయం చేయడానికి మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవితో పాటు ఇతర స్టార్స్ అంతా హాజరవుతారని సమాచారం.

Niharika Mother Is Ramya Krishna

ఈ చిత్రానికి నిహారిక రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

English summary
Konidela Niharika’s debut film ‘Okka Manasu’ is confirmed to take off with shooting schedules in next few weeks under the direction of Rama Raju of ‘Mallela Theeramlo Sirimalle Puvvu’ fame with Naga Shourya as hero. Niharika Mother Is Ramya Krishna.
Please Wait while comments are loading...