»   »  నిహారిక సినిమా ఆడియో ఫంక్షన్ చిరు వల్లే ఆగిపోయిందా..?

నిహారిక సినిమా ఆడియో ఫంక్షన్ చిరు వల్లే ఆగిపోయిందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరోయిన్ నిహారిక నటిస్తున్న చిత్రం 'ఒక్క మనసు' ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంబానికి ముందే నిహారిక యూట్యూబ్ సిరీస్ "ముద్ద పప్పు -ఆవకాయ "తొనే నటిగా తానేమిటో నిరూపించుకుంది. మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు ఫేం రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో యువ హీరో నాగ శౌర్య నిహారిక కి జోడీ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

niharika-chiranjeevi

అయితే ఈ చిత్రం ఆడియో విడుదలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ! కొడిదెల కుటుంబం నుంచి వస్తున్న మొదటి హీరొయిన్ నిహారిక నే కావటం తొ సహజంగానే అంచనాలూ మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా పరిచయం అవుతున్న నిహారిక మొదటి చిత్రం ఆడియో వేడుకకు మెగాస్టార్ తో పాటు పలువురు మెగా హీరోలు కూడా హాజరు కానున్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం "ఒక్క మనసు" వేదిక మీద కనిపించనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది కూడా. అంతా బాగానే ఉంది కదా అనుకుంటూండగానే ఉన్న పళంగా ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెంటనే మేకర్స్ ప్రకటించారు..

ఎందుకన్నది పైకి చెప్పకున్నా., ఇప్పుడు అనుకుంటున్న డేట్ లో ఆడియో ఫంక్షన్ కి మెగాస్టార్ రావటం కుదరదట. ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి 150 చిత్రం లాంచింగ్ ని ఈ నెల 29న సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మెగా స్టార్ ఒక్క మనసు ఆడియో వేడుకకు వచ్చే అవకాశాలు లేవు. దీంతోనే ఈ చిత్రం ఆడియో వేడుకను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

English summary
Niharika new movie "Okamanasu" audio release postponed for Chiranjeevi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu