»   » ఊహించని ట్విస్ట్: నాగబాబు కూతురు నిహారిక ‘మొదటి పెళ్లి చూపులు’

ఊహించని ట్విస్ట్: నాగబాబు కూతురు నిహారిక ‘మొదటి పెళ్లి చూపులు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కుమార్తె నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే బేనర్ స్థాపించి దీన్ని స్వయంగా నిర్మించారు కూడా.

నెటిజన్ల నుండి ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. అయితే పరిమితమైన ఎపిసోడ్లతో దీన్ని ముగించడంతో చాలా మంది నిరాశ పడ్డారు కూడా. తర్వాత ఆమె 'ఒక మనసు' ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.

మెగా డాటర్ ఇమేజ్ ఉండటంతో కొన్ని పరిమితులకు లోబడి ఆమె నటించాల్సి వచ్చింది. సినిమాలో కావాల్సినంత మసాలా లేక పోవడం, చాలా స్లోగా సాగే ప్రేమ కథ కావడంతో ఈ 'ఒక మనసు' సినిమాకు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు రాలేదనే చెప్పాలి.

ఊహించని ట్విస్ట్

ఊహించని ట్విస్ట్

త్వరలో నిహారిక రెండో సినిమా ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నిహారిక. త్వరలో తన సొంత బేనర్ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ లో రెండో వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటిచారు.

‘మొదటి పెళ్లి చూపులు’

‘మొదటి పెళ్లి చూపులు’

ఈ వెబ్ సిరీస్ ‘మొదటి పెళ్లి చూపులు' అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ‘మా తర్వాతి పింక్‌ ఎలిఫెంట్‌ ప్రాజెక్టు ఇదిగో.. హరీష్‌ నాగరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్‌' అని నిహారిక పోస్ట్‌ చేసిన ఆమె ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

నిహారిక నటించడం లేదు

నిహారిక నటించడం లేదు

‘మొదటి పెళ్లి చూపులు' అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో నిహారిక నటించడం లేదు. నయా అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోటోస్ కూడా రిలీజ్ చేసారు.

నిహారిక రెండో సినిమా ఉందా? లేదా?

నిహారిక రెండో సినిమా ఉందా? లేదా?

నిహారిక రెండో సినిమాకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది కానీ దానిపై ఇప్పటి వరకు అఫీషియల్ సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు. ఈసారి స్ట్రెయిట్ సినిమాతో కాకుండా ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. పంజాబీ మంచి విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ తెలుగు రీమేక్ గా ఆమె ఎంచుకున్నారు.

హీరో, దర్శకుడు ఎవరో?

హీరో, దర్శకుడు ఎవరో?

కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని టాక్. ఈ సినిమాలో హీరోగా 'పెళ్ళిచూపులు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ఓకే కాలేదు.

నిహారిక పరిస్థితి వేరు...

నిహారిక పరిస్థితి వేరు...

నిహారికకు ఇతర హీరోయిన్లలా స్వేచ్చ లేదు. సినిమా అన్నాక కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ను కాస్త గ్లామర్ గా చూపించడం మామూలే. అయితే అలాంటి సీన్లు పెడితే మెగా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో అలాంటి సీన్లు ఏమీ లేకుండానే... ఇప్పటి ట్రెండును ఫాలో అవ్వకుండా సినిమా చేయడం కాస్త ఇబ్బందే మరి.

నాగబాబు పరిశీలించాకే

నాగబాబు పరిశీలించాకే

నిహారికతో ఎవరైనా దర్శకులు సినిమా చేయాలంటే ముందుగా నాగబాబును సంప్రదించాల్సిందే. కథలను ముందుగా నాగబాబు పరిశీలిస్తాడని... ఆయన ఒకే అన్న తర్వాతే నిహారిక వద్దకు కథలు వెలుతాయని టాక్.

English summary
"Our next project from Pink Elephant Pictures is 'MODATI PELLICHOOPULU'. Directed by Harish Nagaraj. All the very best!" Niharika posted on FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu