»   » భల్లే సెట్టయిందే: నాగబాబు కూతురు పెళ్లి చూపులు కుర్రాడితో...!

భల్లే సెట్టయిందే: నాగబాబు కూతురు పెళ్లి చూపులు కుర్రాడితో...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 'ఒక మనసు' చిత్రం విడుదల ముందు వరకు నిహారిక గురించి హడావుడి బాగానే జరిగినా.... రిలీజ్ తర్వాత హడావుడి పూర్తిగా మాయమైపోయింది. అందుకు కారణం సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడమే.

వాస్తవానికి నిహారికకు... ఇతర హీరోయిన్లలా స్వేచ్ఛ లేదనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ ఇమేజ్, భారీగా అభిమానుల కలిగిన కుటుంబ నేపథ్యం ఉండటంతో ఆమె పరిమితమైన కథలు, పాత్రలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి. తొలి సినిమా పెద్దగా ఆడక పోవడంతో రెండో సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... నిహారిక రెండో సినిమాకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి స్ట్రెయిట్ సినిమాతో కాకుండా ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. పంజాబీ మంచి విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ తెలుగు రీమేక్ గా ఆమె ఎంచుకున్నారు.

కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా 'పెళ్ళిచూపులు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఎంపికైనట్లు తెలస్తోంది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోస్..

త్వరలో షూటింగ్ ప్రారంభం

త్వరలో షూటింగ్ ప్రారంభం

పంజాబీ సినిమాను తెలుగు నేటివిటీకి తగిన విధంగా స్క్రిప్టులో మార్పులు చేసారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుంది.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

ఇటీవల వచ్చిన పెళ్లి చూపులు మూవీతో విజయ్ దేవరకొండ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కథ పరంగా అతడు నిహారిక జోడీగా బాగా సెట్టవుతాడని అంటున్నారు.

మెగా ఇమేజ్...

మెగా ఇమేజ్...

ఈ సినిమా కథ కూడా మెగా ఫ్యామిలీ ఇమేజ్ కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తగా డిజైన్ చేసారట.

స్వేచ్ఛ లేదు...

స్వేచ్ఛ లేదు...

నిహారికకు ఇతర హీరోయిన్లలా స్వేచ్చ లేదు. సినిమా అన్నాక కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ను కాస్త గ్లామర్ గా చూపించడం మామూలే. అయితే అలాంటి సీన్లు పెడితే మెగా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో అలాంటి సీన్లు ఏమీ లేకుండానే ఈ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారట.

నాగబాబు మానిటరింగ్

నాగబాబు మానిటరింగ్

నిహారిక ఎంచుకునే కథలను ముందుగా నాగబాబు పరిశీలిస్తాడని... ఆయన ఒకే అన్న తర్వాతే నిహారిక వద్దకు కథలు వెలుతాయని టాక్.

సోషల్ మీడియాలో....

సోషల్ మీడియాలో....

మెగా ఫ్యామిలీకి అభిమానులు ఉన్నట్లే.. యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. నిహారిక సినిమాకు సంబంధించి వారికి ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శలతో సోషల్ మీడియాలో రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

ఎంటర్టెన్మెంట్

ఎంటర్టెన్మెంట్

నిహారిక తొలి సినిమాలో అసలు ఎంటర్టెన్మెంట్ లేదు. సినిమా ఆడక పోవడానికి కారణాల్లో అదీ ఒకటి. అయితే ఈ సినిమాలో మాత్రం ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ బాగా జోడించారట.

English summary
According to the latest update, recently debutante Karthik met Niharika and narrated the script. She is very impressed and it is heard that makers have finalized the lead actor and he is none other than Vijay Devarakonda, who is enjoying the success of his recently released movie “Pelli choopulu”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu