»   » నిహారిక టెర్మ్స్ అండ్ కండీషన్స్.... (రొమాంటిక్ వీడియో)

నిహారిక టెర్మ్స్ అండ్ కండీషన్స్.... (రొమాంటిక్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. ఇదేదో ఆమె సడెన్ గా తీసుకున్న నిర్ణయం కాదు....ఇంట్లో అంతా సినిమా వాతావరణమే ఉండటంతో హైస్కూల్ రోజుల్లోనే ఆమె సినిమా హీరోయిన్ కావాలని ఫిక్స్ అయింది. అందుకు తగిన విధంగా ముందుకు అడుగులు వేస్తూ తనలోని టాలెంటుకు మురుగులు దిద్దుకుంటూ వచ్చింది. ఇందుకోసం మూడు నాలుగేళ్ల నుండే నిహారిక ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కొన్ని షార్ట్ పిలింస్ లో కూడా నటించింది. 'టెర్మ్స్ అండ్ కండీషన్స్' పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్ లో నిహారిక నటించింది. అంతే కాదు.... 'అలియాస్ జానకి' సినిమాలోని పాటను ఈ షార్ట్ ఫిల్మ్ లో నిహారికతో చేసారు. ఈ సాంగులో నిహారిక అదరగొట్టింది. రొమాంటిక్ గా ఉన్న ఈ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.

బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చే వరకు నిహారిక గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. బెల్లితెరపై ఎంతో చలకీగా యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. ఇపుడు 'ముద్దు పప్పు ఆవకాయ్' ద్వారా సూపర్ పాపులర్ అయింది. త్వరలో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

Niharika's Terms & Conditions promo song

నాగ బాబు కూతురు నిహారిక నటించిన వెబ్ సిరీస్ 'ముద్దపప్పు ఆవకాయ'కు నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ రిలీజ్ కాగా.... దాదాపు 50 లక్షల మంది చూసారు. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో 'ముద్ద పప్పు ఆవకాయ్' తెరకెక్కుతోంది.

మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. 'ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

English summary
Konidela Niharika's Terms & Conditions promo song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu